మంత్రి అనిల్‌ కుమార్‌​ మానవతా హృదయం | Anil Kumar Yadav Humanity In Road Accident Prakasam | Sakshi
Sakshi News home page

మంత్రి అనిల్‌ కుమార్‌​ మానవతా హృదయం

Published Mon, Jun 24 2019 3:57 PM | Last Updated on Mon, Jun 24 2019 4:20 PM

Anil Kumar Yadav Humanity In Road Accident Prakasam - Sakshi

సాక్షి, ప్రకాశం: కలెక్టర్ల సమావేశంలో పాల్గొనేందుకు అమరావతికి బయలుదేరిన రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌.. ‍ప్రమాదంలో గాయపడిని వారిని రక్షించి మానవత హృదయాన్ని చాటుకున్నారు. నెల్లూరు నుంచి అమరావతికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో ప్రకాశం జిల్లా మెదరమెట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందన్న విషయాన్ని మంత్రి గుర్తించారు. దీంతో వెంటనే కాన్యాయ్‌ ఆపి.. ప్రమాదంలో గాయపడిని వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. 

క్షతగాత్రులను ఎలాగైనా బతికించాలనే తాపత్రయంతో వారిని అతి త్వరగా తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లాలని తన సిబ్బందిని మంత్రి ఆదేశించారు. కానీ అంతకుమందే అక్కడి వారు108కు సమాచారం ఇవ్వడంతో.. ఆ వాహనంలో వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారికి ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు అందించాలని వారిని ఆదేశించారు. మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మానవతా హృదయానికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అత్యవసర పని మీద వెళ్తున్నప్పటికీ రోడ్డు ప్రమాదాన్ని గమనించి.. గాయపడ్డ వారికి మంత్రి చేయూతనిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement