![Arun singh commenetd over tdp - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/17/tdp.jpg.webp?itok=_vjrBL7F)
సాక్షి, హైదరాబాద్: ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలిగినా ఎలాంటి నష్టం ఉండబోదని, ఇది బీజేపీకే లాభం చేకూర్చే పరిణామమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ కాస్త కష్టపడితే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
రెండు రోజుల పర్యటన కోసం తెలంగాణకు వచ్చిన ఆయన శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, ఓబీసీ మోర్చా, మీడియా కమిటీ, ఐటీ, సోషల్ మీడియా కమిటీలతో భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment