
సాక్షి, హైదరాబాద్: ఏఐ సీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా చార్మినార్ నుంచి పోటీ చేయాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆహ్వానించారు. శనివారం చార్మినార్ ఎదుట నిర్వహించిన రాజీవ్ సద్భావన యాత్రలో పాల్గొనడానికి రాహుల్ రావడానికి ముందు ఆయనకు స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు.
‘చార్మినార్‌కు రాహుల్‌ని స్వాగతి స్తున్నా. మీకు, అమిత్‌షాకు చార్మినార్‌పై ఆసక్తి ఉ న్నందున మీ ఇద్దరిని ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆహ్వానిస్తున్నా. ఇక్కడి సంస్కృతికి ఎవరు సరైన ప్రాతినిధ్యం వహిస్తారో మీకు చూపించే అవకాశాన్ని ప్రజలకు ఇవ్వండి’ అని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment