కొలువుదీరిన కొత్త ప్రభుత్వం | Ashok Gehlot Oath As Rajasthan New CM | Sakshi
Sakshi News home page

కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

Published Mon, Dec 17 2018 1:28 PM | Last Updated on Mon, Dec 17 2018 7:01 PM

Ashok Gehlot Oath As Rajasthan New CM - Sakshi

అశోక్‌ గహ్లోత్‌, సచిన్‌ ఫైలెట్‌లతో ప్రమాణం చేయిస్తున్న గవర్నర్‌ కళ్యాణ్‌ సింగ్‌

జైపూర్‌: రాజస్తాన్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత అశోక్‌ గహ్లోత్‌ రాజస్తాన్‌ 12వ ముఖ్యమంత్రిగా ప్రమాణాస్వీకారం చేశారు. ఆయతోపాటు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సచిన్‌ ఫైలెట్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. జైపూర్‌లోని చారిత్రక అల్బర్ట్‌ హాల్‌లో రాష్ట్ర గవర్నర్‌ కళ్యాణ్‌ సింగ్‌ వీరితో సోమవారం ‍ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో పాటు రాష్ట్ర మాజీ సీఎం వసుంధర రాజే, ఒమర్‌ అబ్దుల్లా, తేజస్వీ యాదవ్‌, కర్ణాటక సీఎం కుమార స్వామి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా తదితరులు హాజరైయ్యారు.  

మోదీ శుభాక్షాంక్షలు..
రాజస్తాన్‌ నూతన సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అశోక్‌ గహ్లోత్‌కి, ఉప ముఖ్యమంత్రి సచిన్‌కు ప్రధాని నరేంద్ర మోధీ అభినందనలు తెలియజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement