
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని కేంద్ర మాజీమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వలేదని ప్రజలు టీఆర్‌ఎస్‌ను తిడుతున్నారని, మోదీకి ఉన్న ఆదరణను బీజేపీకి అనుకూలంగా మార్చుకోవాలని కార్యకర్తలకు సూచించారు. టీఆర్‌ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో 18 వేల ఉద్యోగాలే ఇచ్చిందని, ఉద్యోగాల భర్తీలో విఫలమైం దని విమర్శించారు. నిరుద్యోగులు ప్రభుత్వంపై కోపంతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశముందని, పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలన్నారు. టీఆర్‌ఎస్‌తో బీజేపీకి పొత్తు ఉండదన్నారు. కొత్త జోన్లను ఆమోదించినందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు.
‘జోనల్’ ఆమోదాన్ని స్వాగతిస్తున్నాం: లక్ష్మణ్
రాష్ట్రంలో కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం తెలపడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. జోనల్ వ్యవస్థ ఆమోద ప్రక్రియను సత్వరమే పరిష్కరించి, తెలంగాణ పట్ల కేంద్రానికి ఉన్న నిబద్ధతను చాటుకున్నారన్నారు. దీంతో రాష్ట్రంలో నియామకాలు వేగంగా జరిగేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ, ఇతర అనుమతులు ఇవ్వడంలో, సంక్షేమ పథకాలకు నిధులలివ్వడంలో ప్రధాని రాష్ట్రానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment