సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడం ఆపితే ప్రజలపై భారం తగ్గుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వెంటనే బెల్ట్ షాపులు, పర్మిట్ రూల్స్, హైవేలపై మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అడ్డగోలుగా అప్పులు చేయడంతో రాష్ట్రం పై భారం పడుతుందని విమర్శించారు.
ప్రభుత్వం చేసిన అప్పులను ప్రజలపై మద్య రూపంలో రుద్దుతుంది. మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులను మద్యం ద్వారా వచ్చే ఆదాయం వల్ల కేసీఆర్ పాలన చెయ్యాలని చూస్తున్నారు. సామాన్యుల నుంచి మద్యం పై ఏడాదికి దాదాపు 25వేల కోట్లు రాబడి వస్తుందని ఆయన తెలిపారు. సామాన్య ప్రజలను మద్యానికి బానిసగా చేసేందుకు విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్నాయి.ఇప్పటికైనా మద్యంపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తామని భట్టి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment