
మహేశ్వరం: 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50 శాతం టికెట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుక్కుగూడ సత్యనారాయణ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కురుమ మహాసభలో ఆయన మాట్లాడారు.
70 ఏళ్ల నుంచి రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు రాజకీయవాటా ఇవ్వకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గంలో ఉన్న బీసీ నేతలకు పార్టీలు సీట్లు ఇచ్చి గెలిపించాలన్నారు. బీసీలను విస్మరిస్తే తెలంగాణ, ఏపీలో బీసీ పార్టీలు పుట్టుకొస్తాయని స్పష్టం చేశారు.
సంబరాలు తప్ప ఉద్యోగాలేవీ..?
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా రాష్ట్రంలో సంబరాలు తప్ప ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు పెద్దగా లేవని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య విమర్శించారు. నాలుగేళ్లుగా రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించుకుంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, అయితే ఆచరణలో మాత్రం అవేవీ కనిపించడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment