భారత్‌ బంద్‌ హింస: పెరిగిన మృతుల సంఖ్య | BharatBandh, Death toll rises to 7 in MadhyaPradesh. | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 3 2018 8:55 AM | Last Updated on Mon, Oct 8 2018 3:19 PM

BharatBandh, Death toll rises to 7 in MadhyaPradesh. - Sakshi

భోపాల్‌ : భారత్‌ బంద్‌ సందర్భంగా మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో మరణించిన వారి సంఖ్య పెరిగింది. మధ్యప్రదేశ్‌లో  ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సోమవారం ఆరుగురు మరణించగా.. మంగళవారం మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి మంగళవారం ఉదయం ప్రాణాలు విడిచాడు. అటు ఉత్తరప్రదేశ్‌లోనూ భారత్‌ బంద్‌ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న మీరట్‌లో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులుస మధ్యాహ్నం రెండు 2 గంటలవరకు ఇంటర్నెట్‌ నిలిపివేశారు.

 ఎస్సీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును నిరసిస్తూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు సోమవారం నిర్వహించిన భారత్‌ బంద్‌.. మధ్యప్రదేశ్‌లో తీవ్ర హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చోటుచేసుకున్న హింసలో మధ్యప్రదేశ్‌లో ఏడుగురు చనిపోగా, ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు, రాజస్తాన్‌లో ఒకరు.. మొత్తం పదిమంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పో యారు. ముందస్తుగా అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించగా.. మధ్యప్రదేశ్‌లోని భింద్‌ జిల్లాలో ఆర్మీని రంగంలోకి దింపారు.

చదవండి: చెలరేగిన హింస.. తొమ్మిది మంది మృతి, వందల మందికి గాయాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement