
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ పార్టీ ప్రభావం చూపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న కమలనాథులు లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టి టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీని ఇస్తున్నారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉండగా..ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి నాలుగు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు వెలువడిన ఫలితాల్లో ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి బాపురావు 48వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ 17వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కరీంనగర్‌లో బండి సంజయ్‌కుమార్ 70వేల ఓట్ల ఆధిక్యం, సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి 35వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment