సాక్షి, నల్గొండ : రాబోయే ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తామని బీజేపీ నేత కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు కలిసి పోయారని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. మజ్లీస్ పార్టీతో కలిసే ఏ పార్టీతో భవిష్యత్‌లో పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో టీఆర్‌ఎస్ విఫలమైందని ఆరోపించారు. ఎలిమినేటి మాధవ్ రెడ్డి ప్రాజెక్టు, శ్రీశైలం సొరంగ మార్గ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పోరాటం చేశాడు. కానీ నేడు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్ట్ పనులు అడుగు ముందు పడడంలేదని విమర్శించారు. ప్రాజెక్టుల పెండింగ్ విషయంలో టీఆర్‌ఎస్ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment