సాక్షి, విజయవాడ: సినీనటి ఏపీ బీజేపీ ఉపాధ్యక్షురాలు కవిత టీడీపీపై మరో సారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్‌ను భూస్థాపితం చెయ్యాలని కంకణం కట్టుకున్న టీడీపీ ఇప్పుడు కాంగ్రెస్ పాదాల దగ్గర చేరారని ఆరోపించారు. టీడీపీ రాహుల్ గాంధీతో చేతులు కలిపారు కాబ్బటే కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్న ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా బాధపడున్నారని అన్నారు. మీరు త్వరలో ఒక వార్త వింటారు. రెండు కళ్ల సిద్ధాంతం అని చెప్పిన చంద్రబాబు, కిరణ్ కూమార్ రెడ్డి ఇద్దరు వెనుక నుంచి వెళ్లి రాష్ట్రాన్ని విడగొట్టారని విమర్శించారు. తెలంగాణా రాష్ట్రంలో టీడీపీని భూ స్ధాపితం చేసింది చంద్రబాబేనని, తెలంగాణాలో టీడీపీని నమ్ముకున్న వారిని నట్టేట ముంచారని అన్నారు.
ఇక్కడ సెక్రటేరియట్ ఉండగా అక్కడ రేకుల షేడ్లో ఎందుకు ఉంటున్నారో అర్థం కావడం లేదన్నారు. 23 జిల్లాలను వదిలి 13 జిల్లాలకే పరిమితం అయ్యారు చంద్రబాబును రాబోయే రోజులల్లో ఏపీ ప్రజలు కూడా అక్కడి నుంచి తరిమికొడుతారని అన్నారు. జనసేనను వైఎస్సార్‌సీపీని ఎదుర్కొనలేకే బీజేపీని విమర్శిస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత డబ్బును తెలంగాణ ఎలక్షన్ ఖర్చు పెట్టాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఖర్చు పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని తెలిపారు.
ఓటు కు నోటు కేసులో దొరికిన బాబుకు బుద్ధి రాలేదని, కుటుంబ రావు మాట్లాడేవన్ని అబద్ధాలేనని అన్నారు. కాంగ్రెస్‌కు చంద్రబాబు దత్తపుత్రుడు అయ్యారు. తెలంగాణ, ఏపీల్లో తెలుగు కాంగ్రెస్ లాగా మారబోతుందన్నారు. టీడీపీని కాంగ్రెస్లో కలుపుతారు కాబట్టే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లో చేర్చారు. కర్ణాటకలో రాహుల్ పక్కన ఉండి బీజేపీ ఓడించారని అన్నారు. అదే తరహాలో రాహుల్ గాంధీ పక్కన ఉండి చంద్రబాబు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఓడించాలని చూశారు కానీ అదే మాకు మంచిది అయ్యిందని కవిత వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment