
సాక్షి, విజయవాడ : ఆపరేషన్ ద్రవిడ పేరిట ఇటీవల బీజేపీపై పలు ఆరోపణలు చేసిన సినీ నటుడు శివాజీపై ఆ పార్టీ నేతలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేశారని నగరంలోని సూర్యారావు పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు.
ప్రధాని మోదీపై శివాజీ అమానుష వ్యాఖ్యలు చేశారని, మోదీని ఇడియట్ అని దూషించడంతోపాటు.. ఆయన ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలను చేశారని నగర బీజేపీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. శివాజీపై కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరినట్టు వారు మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment