
కార్యక్రమంలో మాట్లాడుతున్న రఘునందన్‌రావు
సాక్షి, రాయపోలు(దుబ్బాక): టీఆర్‌ఎస్ పార్టీలో మెదక్ లోక్‌సభ పరిధిలోని పోటీచేసేందుకు పనికివచ్చే నాయకుడే లేకుండా పోయాడా.. కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన కొత్త ప్రభాకర్‌రెడ్డిని తీసుకొచ్చి నిలబెట్టారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మెదక్ లోక్‌సభ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. దుబ్బాక నియోజకవర్గస్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం దౌల్తాబాద్‌లో మంగళవారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. దుబ్బాక కార్యకర్తలు తన వెన్నంటే ఉన్నారని, కొందరిని టీఆర్‌ఎస్ పార్టీ నేతలు ప్రలోభాలకు గురిచేసి పార్టీ ఫిరాయింపులకు గురిచేస్తున్నారన్నారు. అయినప్పటికీ కార్యకర్తలు తమకు అండగా నిలబడతున్నారన్నారు. నేనెప్పటికీ దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానన్నారు. విషయాన్ని గుర్తించి ప్రజలు ఓటేయాలన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ ఇంచార్జీ అంబటి బాలేష్‌గౌడ్, నాయకులు తోట కమలాకర్‌రెడ్డి, యాదగిరి, వెంకట్‌గౌడ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment