సాక్షి, అమరావతి : ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్ని రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖమంత్రి కొడాలి నాని తెలిపారు. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, శ్రీరంగనాథ రాజుతో పాటు ముఖ్యమంత్రి సలహాదారు అజేయ కల్లం, పౌర సరఫరాల సీఎంవో అధికారులు పాల్గొన్నారు. అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ.. రేషన్ షాపుల ద్వారా పంపిణీ అవుతున్న బియ్యం పక్కదారి పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బియ్యం తినడానికి పనికి రాకపోవడంతో రీసైక్లింగ్‌కు పంపుతున్నామని తెలిపారు.
కేంద్రం నుంచి వస్తోన్న బియ్యంలో 25 శాతం నూక వస్తోందని, దీనిని వండితే అన్నం ముద్దగా మారుతోందని అన్నారు. రేషన్ పంపిణీలో వినూత్న మార్పులు తీసుకువచ్చి కల్తీ లేని బియ్యాన్నిఅందిస్తామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 1 నుంచి అన్ని రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని, దీనికోసం 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయని పేర్కొన్నారు. సన్న బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వంపై వెయ్యి కోట్లు భారం పడుతుందన్న మంత్రి బియ్యం సేకరణకు అవలంభించాల్సిన విధానాలపై చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment