సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసీ నిర్ణయం | Central Election Commission Decide To Transfers All Officials Involved Elections | Sakshi
Sakshi News home page

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఈసీ కీలక నిర్ణయం

Jan 28 2019 12:49 PM | Updated on Jan 28 2019 8:31 PM

Central Election Commission Decide To Transfers All Officials Involved Elections - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణతో సంబంధమున్న అధికారులను సొంత జిల్లాల నుంచి బదిలీ చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. లోక్‌ సభ, ఏపీ, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారు, గత నాలుగేళ్ల కాలంలో మూడేళ్లు ఒకే దగ్గర పని చేస్తున్న అధికారులను వెంటనే బదిలీ చేయాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement