సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్లుగా సాగుతోన్న అవినీతిపై విమర్శలు చేస్తోన్న బీజేపీపై సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఇప్పటికే అమిత్ షా కుమారుడి అవినీతిపై విమర్శలుచేసిన ఏపీ సీఎం.. ఇప్పుడు ప్రధాని మోదీని పరోక్షంగా హెచ్చరించడం గమనార్హం. ‘‘ఎన్నడూ లేని విధంగా బీజేపీలో కొత్త కల్చర్ వచ్చింది. 40 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడిని నేను. హామీలు అమలుచేయమని అడిగితే ఎదురుదాడి చేస్తారా? మా గురించి వాళ్లు మాట్లాడితే మనం మోదీ, అమిత్‌షాల గురించి మాట్లాడాల్సి వస్తుందని చెప్పండి..’ అంటూ టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించిన వ్యూహంపై ఎంపీలతో బుధవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారాయన.
జైట్లీతో సుజనా భేటీ: ఒకవైపు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి, ఇంకోవైపు ఆర్థిక మంత్రి జైట్లీతో రహస్య సమావేశాలు జరుపుతోన్న ఎంపీ సుజనా చౌదరి వ్యవహారంపై టీడీపీ వర్గాలు చర్చించాయి. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పేనని, ఇకపై ఎవరితోనూ రహస్యంగా మతనాలు జరపొద్దని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. ‘‘దేశంలో అందరికంటే ముందు నేను సీఎం అయ్యాను. గతంలోనే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పిన నేతను. చిన్న మచ్చ కూడా లేని నాపై కేంద్రం దాడి చేస్తుందా..’’ అని ప్రశ్నించాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment