
సాక్షి, తిరుపతి: చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఉదయం తుడా కార్యాలయంలోని తన ఛాంబర్‌లో అడుగుపెట్టిన చెవిరెడ్డి... ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు. మహానేత వైఎస్‌ఆర్ హయాంలోనూ చెవిరెడ్డి తుడా చైర్మర్‌గా పనిచేశారు. తుడా పరిధిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెవిరెడ్డి తెలిపారు.
శ్రీవారిని దర్శించుకున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు
తిరుమల శ్రీవారిని పలువురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్, కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి విడివిడిగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో కుటుంబసమేతంగా... ఎమ్మెల్యేలు స్వామివారిని సేవించుకున్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్న పథకాలను పూర్తిస్థాయిలో ప్రజలకు అందజేస్తామన్నారు. ఏపీకి వైఎస్ జగన్ దీర్ఘకాలం సీఎంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment