ప్రజల ఆరోగ్యంతో రాజకీయం వద్దు : గీతారెడ్డి | Chief Minister should do justice : Geetha Reddy | Sakshi
Sakshi News home page

ప్రజల ఆరోగ్యంతో రాజకీయం వద్దు : గీతారెడ్డి

Published Wed, May 30 2018 11:38 AM | Last Updated on Wed, May 30 2018 11:38 AM

Chief Minister should do justice : Geetha Reddy - Sakshi

దీక్షకు సంఘీభావం తెలుపుతున్న గీతారెడ్డి  

సంగారెడ్డి టౌన్‌ : ప్రజల ఆరోగ్యంతో రాజకీయం చేయవద్దని సంగారెడ్డి పట్టణ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలి అనేది ప్రజల ఆకాంక్ష అని, మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకై దీక్ష  చేస్తున్న జగ్గారెడ్డికి సంఘీభావం తెలుపుతున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు, జహీరాబాద్‌ ఎమ్మెల్యే గీతారెడ్డి అన్నారు.

సంగారెడ్డిలో  మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజుల నిరవధిక రిలే నిరహర దీక్ష రెండో రోజు కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ప్రకాశ్‌రావు, జిల్లా సెక్రెటరీ సయ్యద్‌ జలాలుద్దీన్, నాయకులు ఎం.ఏ.రహమాన్, నరేందర్‌రెడ్డి, జహీరాబాద్‌ ఎమ్మెల్యే గీతారెడ్డితో పాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అంజిరెడ్డిగోదావరి, సంగారెడ్డి పట్టణ మెడికల్‌ షాపు అసోసియేషన్, రేషన్‌ డీలర్స్‌ అసోసియేషన్, కిరాణ అండ్‌ గ్రెన్‌ జనరల్‌ మర్చంట్‌ అసోసియేషన్, అబ్ధుల్‌ ఖుయ్యూమ్‌ హాఫెజ్, సంగారెడ్డి నియోజకవర్గ యునైటెడ్‌ ఫాస్టర్స్‌ ఫెలోషిఫ్‌ ఫాస్టర్లు దీక్ష వేదిక వద్దకు వచ్చి జగ్గారెడ్డితో పాటు దీక్ష చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులకు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా యునైటెడ్‌ ఫాస్టర్స్‌ ఫెలోషిఫ్‌ పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశిస్సులు అందజేశారు.  జహీరాబాద్‌ ఎమ్మెల్యే గీతారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డిలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయకపోవడం అన్యాయమన్నారు. ఉమ్మడి జిల్లాకు కేంద్ర బిందువు అయిన సంగారెడ్డి కాకుండా కొత్త జిల్లా సిద్దిపేటలో కళాశాల ఏర్పాటు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు.

ఇప్పటికే సిద్దిపేటలో ఓ ప్రైవేట్‌ కళాశాల ఉండగా  ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి అనుమతి ఇచ్చారని, ములుగులో మరో ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజి నడుస్తుందని, దానిలో ఇద్దరు మంత్రులు సైతం దానిలో కలిసి ఉన్నారన్నారు. ఉమ్మడి జిల్లాలో పుట్టిన ముఖ్యమంత్రి సంగారెడ్డి జిల్లా ప్రజలకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు.  స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారన్నారు.

జగ్గారెడ్డి పోరాటంలో కాంగ్రెస్‌ పార్టీ వెంట ఉందని ఏలాంటి కార్యక్రమాలు చేపట్టిన సంఘీభావం తెలుపుతూ ముందుకు వెళ్తామన్నారు. ఈ ధర్నాలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి తోపాజి అనంతకిషన్, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సంతోష్‌కుమార్, శ్రీకాంత్, శంకర్‌రెడ్డి, రఘుగౌడ్, మహేశ్, షేక్‌ సాబేర్, సంజీవ్, సు«ధాకర్‌తో పాటు సంగారెడ్డి పట్టణం, వివిధ గ్రామాల నాయకులుపాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement