సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నాలుగేళ్లుగా కేంద్రంలో అధికారాన్ని పంచుకుని రాష్ట్రానికి సంజీవని వంటి ప్రత్యేక హోదాను సాధించకపోగా, దానిని శాయ శక్తులా నిర్వీర్యం చేసి... హోదా కోసం ప్రజలే పోరాడుతున్న దశలో అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుని తనే హోదా చాంపియన్ అని నిరూపించుకోవడానికి చంద్రబాబు చేస్తున్న విన్యాసాలను మనం రోజూ చూస్తున్నాం..
తెలుగుజాతి ఆత్మగౌరవ సమస్య అని ఒకరోజు, రాష్ట్రంపై కేంద్రం యుద్ధం చేస్తున్న దని మరో రోజు, కేంద్రంపై రాజీలేకుండా పోరాడుతున్నట్లు ఇంకోరోజు కలరింగ్ ఇస్తూనే నాలుగేళ్లుగా పాల్పడిన లక్షల కోట్ల అవినీతి వ్యవహారాలు ఎక్కడ బయటపడతాయో అని వణుకుతున్న చంద్రబాబు కేంద్రంతో రాజీయత్నాలు ప్రారంభించారు..
ఒకవైపు పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తూనే.. మరోవైపు లాలూచీకి యత్నిస్తూ ఆయన ఈ నాటకాన్ని మహా బాగా రక్తికట్టిస్తున్నారు. జాతికి జీవధార వంటి పోలవరంపైనా, పట్టిసీమ పనుల పైనా, రాజధాని భూములౖ పెనా, అన్ని రంగాలకూ విస్తరించిన అవినీతి పైనా నిన్నమొన్నటివరకు మిత్రపక్షాలుగా ఉన్న పవన్, బీజేపీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. ప్రజలలో కూడా బాబు అవినీతిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దాంతో విచారణ ఎదుర్కో వలసి వస్తుందేమోనన్న వణుకు చంద్రబాబు లో మొదలయ్యింది. అందుకే ఢిల్లీలో పార్టీకి అనుకూలంగా ఉన్న పెద్దలతో ఇద్దరు మంత్రు లను కలసి ప్రయత్నాలు చేయడం ప్రారంభించినట్లు తెలిసింది. ‘ఏదో ఒక సాను కూల ప్రకటన చేసి మమ్మల్ని బయటపడే యండి రాజీపడతాం’ అని ఆయన అభ్యర్థిస్తు న్నట్లు సమాచారం.
అయితే తమ అనుకూల పత్రికలో మాత్రం ఇదే విషయాన్ని మరో రకంగా ప్రచారం చేసుకున్నారు. బీజేపీయే దిగివచ్చి చంద్రబాబుతో ‘కలిసుందాం..ఇంకా దూరం పెంచుకోవద్దు’ అని రాజీ ప్రతిపాద నలు చేస్తున్నట్లు అందులో వచ్చింది. నిజానికి పోలవరం, పట్టిసీమ వంటి ప్రాజెక్టులలో అడ్డగోలుగా అవినీతిపై సాక్ష్యాధారాలతో సహా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ గతంలోనే అనేకమార్లు బయటపెట్టింది. మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చాయి. కాగ్ తూర్పారబట్టింది. ప్రజాపద్దుల కమిటీ కూడా ఆక్షేపించింది. టీడీపీతో చెడిన తర్వాత బీజేపీ కూడా ఈ అవినీతిపై విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. దాంతో చంద్రబాబుకు భయం పట్టుకుంది. నిజంగానే సీబీఐ విచారణ జరిగితే అడ్డంగా దొరికిపోతామన్న వణుకు మొద లైంది. ఢిల్లీలో చేస్తున్న లాలూచీ ప్రయత్నాలు ఫలించలేదని, కేంద్రం నుంచి సానుకూల ఫలితం రాలేదని గురువారంనాడు బాబు అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని చూసిన వారికి స్పష్టంగా అర్థమయ్యింది.
ఫలించని రాజీ యత్నాలు..
అవినీతి కేసుల భయంతోనే చంద్రబాబు కేంద్రంతోనూ, బీజేపీతోనూ లాలూచీ ప్రయత్నాలు మొదలుపెట్టారని ఢిల్లీ పరిణా మాలను గమనిస్తున్న విశ్లేషకులంటున్నారు. ‘కాస్త రాయితీలిచ్చినట్లు ప్రకటించండి.. ఈ సమస్య నుంచి మమ్మల్ని బయటపడేయండి. మేం మీకు దూరం పోము.. నమ్మకమైన మిత్రపక్షంగా ఉంటాం’ అని కేంద్రంలో పలుకుబడి ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి ద్వారా ఒకరిద్దరు మంత్రులతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. కేంద్రంతో రాజీపడదా మని ప్రతిపాదనలు పంపినా కేంద్రం నుంచి ఎలాంటి సుముఖతా వ్యక్తం కాలేదని తెలుస్తోం ది. కేంద్రం నుంచి సానుకూలత కనిపించకపోవడంతో ఆ నిర్వేదం చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగంలో స్పష్టంగా కనిపించింది. నాలుగేళ్లపాటు అవినీతి జరిగితే ఇపుడెందుకు మాట్లాడుతున్నారని చంద్రబాబు అడగడం చూసి అందరూ విస్తుపోతున్నారు.
అవినీతి జరిగిందా లేదా అనేది చెప్పకుండా ఇపుడెందుకు మాట్లాడుతున్నారని అనడమేమిటి? అవినీతి జరిగితే అడగొద్దా అని విమర్శ కులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానిని అదీ పార్లమెంటులోనో, ప్రధాని కార్యాలయంలోనో ఓ ఎంపీ కలిస్తే తప్పేమిటి? ఏ తప్పూ చేయకపోతే భయపడాల్సిన పనేమిటి? అన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. విచారణ చేసుకోం డని అంటూనే నా పైన విచారణ ఎలా చేస్తారు? అని బాబు ప్రశ్నించడంపై కూడా విస్మయం వ్యక్తమవుతోంది. తప్పు చేసినట్లు ఆరోపణ లొచ్చినపుడు విచారణ జరగడం తప్పెలా అవుతుందని విమర్శకులంటున్నారు. ఇక ప్రత్యేక హోదా విషయంలోనూ అంతే. ప్రత్యేక హోదా ఇచ్చి అది ఎవరో పోరాడితే ఇచ్చినట్లు కేంద్రం చెప్పబోతోందని చంద్రబాబు వ్యాఖ్యా నించడం పట్ల కూడా విస్మయం వ్యక్తమవు తోంది. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ఆశగా ఎదురుచూస్తున్న హోదా సాకారం కావడం ముఖ్యం కానీ ఎవరు సాధిస్తే ఏమిటి అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.
తప్పు జరగబట్టే.. వణుకు కనబడుతోంది..
కేంద్రం మెత్తబడకపోవడంతో ఎక్కడ విచారణ వేస్తారోనన్న భయంతో బాబుకు వణుకు మొదలయ్యింది. గురువారం ఉదయం జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. ‘నా మీద విచారణ వేస్తారట.. లోకేష్‌పై విచారణ వేస్తారట’ అని బాబు పదే పదే కలవరించడం చూసి పార్టీ ముఖ్య నాయ కులు, ఎంపీలు ఆశ్చర్యపోయారని సమాచా రం. ఇవే విషయాలను అసెంబ్లీలోనూ చంద్ర బాబు పదేపదే ప్రస్తావించారు. ఒకవైపు అసెంబ్లీలో బీజేపీ ఆరోపణలు చేస్తుంటే అనవ సరంగా.. అసందర్భంగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీని తిట్టడం చూసి ప్రజలు విస్తుపోతున్నారు. బాబు సంబంధం లేకుండా మాట్లాడడం చూసి ఏ తప్పూ చేయకపోతే ఆయన ఎందుకు అంతగా భయపడుతున్నారు అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగం చూసినవారంతా ఆయన భయంతో వణికిపోతుండడాన్ని స్పష్టంగా గమనించారు. తప్పు జరగబట్టే చంద్రబాబు స్వరంలో మార్పు వచ్చిందని, బింకాన్ని ప్రదర్శిస్తూ లేనిపోనివి మాట్లాడుతున్నారని సభలో మాట్లాడిన తీరును బట్టి అర్ధమవు తోందని విశ్లేషకులంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా బీజేపీ చేసిన విమర్శలకు చంద్రబాబు నుంచి సమాధానమే లేకుండా పోయింది. తప్పు జరగలేదని, తాము అంతా మంచే చేశామని ఎందుకు బాబు చెప్పలేకపోయారని విమర్శ కులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అసెంబ్లీలో చేసిన అతకని ఆరోపణలపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కూడా ఘాటుగానే స్పందించారు. ‘అంత సచ్ఛీలుడివైతే భయపడ డం ఎందుకు? ధైర్యంగా విచారణను ఎదుర్కో వచ్చు గదా.. గతంలో తనపై ఆరోపణలొచ్చినపుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సీబీఐ విచారణకు సిద్ధపడలేదా?’ అని వారు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment