కుమారస్వామి పదవి మూణ్నాళ్ల ముచ్చటే | CM Seat Is Short Term Post TO Kumara Swami Said By BJP SC Morcha President Sambaiah | Sakshi
Sakshi News home page

కుమారస్వామి పదవి మూణ్నాళ్ల ముచ్చటే

Published Sun, May 20 2018 6:47 PM | Last Updated on Wed, Aug 29 2018 3:33 PM

CM Seat Is Short Term Post TO Kumara Swami Said By BJP SC Morcha President Sambaiah - Sakshi

బీజేపీ ఏపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దారా సాంబయ్య(పాత చిత్రం)

విజయవాడ : ఇంకా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయకుండానే కాంగ్రెస్‌, జేడీఎస్‌ నాయకుల మధ్య పదవుల కోసం గొడవ మొదలైందని, కుమారస్వామి పదవి మూణ్నాళ్ల ముచ్చటే అవుతుందని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య విమర్శించారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో 150 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రజాస్వామ్య విలువలు లేవని విమర్శించారు.

జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు 21 మంది వైఎస్సార్‌సీపీ నాయకులను తీసుకుని నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన విషయం గుర్తు చేశారు. ప్రత్యేక హోదా వద్దు, అది సంజీవని కాదని చంద్రబాబు నాయుడే చెప్పారన్నారు. చంద్రబాబు మెప్పు పొందేందుకు ఆ పార్టీ నాయకులే ఇప్పుడు కావాలని మాట్లాడుతున్నారని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement