సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అవినీతి నిరోధక సంస‍్థ (ఏసీబీ)కు ఈ ఏడాది మొదటి రోజే ఫిర్యాదు అందింది. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును కాంగ్రెస్ పార్టీ సొంత ప్రచారానికి వినియోగిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ వివిధ పత్రికలు, టీవీ మాధ‍్యమాలకు గత నాలుగన్నరేళ్లలో దాదాపు రూ.129.46 కోట్ల యాడ్స్ ఇచ్చారని బెంగళూరు నాగరిక హక్కు పోరాట సమితి ఉపాధ్యక్షుడు గణేష్‌సింగ్ ఏసీబీకి సోమవారం ఫిర్యాదు చేశారు. సదరు యాడ్స్‌లో పథకాల వివరాల కంటే సిద్ధరామయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుల గుణగణాలను వివరించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఈ అక్రమాల్లో రాష్ట్ర సమాచార శాఖకు చెందిన పలువురు అధికారులకు భాగముందని వారినిపై కూడా దర్యాప్తు జరపాలని గణేష్ తన తన 257 పేజీల ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment