సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారికి కాంగ్రెస్ పార్టీ తరపున సంఘీభావం తెలుపుతున్నామని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ శుక్రవారం వెల్లడించారు. ఈ మేరకు ప్రజలను ఉద్దేశిస్తూ ఆమె ఒక వీడియోను విడుదల చేశారు. అందులో తమ హక్కుల కోసం ఆందోళన చేస్తున్న పౌరుల పట్ల ప్రభుత్వం చేస్తున్న అణచివేతను ఖండించారు. ప్రజాస్వామ్యంలో పౌరులకు తమ నిరసన తెలిపే హక్కుందని, అలాగే వారి మాటలను వినాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేశారు. రాజ్యాంగం ప్రకారం తమకు సంక్రమించిన హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులు, యువత, సామాన్య పౌరులకు తమ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.
అలాగే దేశంలో నెలకొన్న హింసాత్మక పరిస్థితుల పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీలు పేదలు, మైనార్టీలను బాధపెడుతుంది. నోట్ల రద్దు సమయంలో నగదు కోసం క్యూలైన్లో నిలబడినట్టుగా, ఇప్పుడు తమ పూర్వీకుల సమాచారంతో పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు నిలబడాల్సి వస్తుందన్న పౌరుల ఆందోళన సహేతుకమైనది. ఈనేపథ్యంలో మీకు అండగా, రాజ్యాంగ విలువలను కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ప్రజలకు హమీ ఇస్తున్నా’నని వీడియోలో వ్యాఖ్యానించారు. చదవండి : హెచ్చరిక : గోద్రా ఘటన రిపీట్ అవుతుంది!
Comments
Please login to add a commentAdd a comment