గాంధీనగర్ : దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పుగా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలులోకి తేవడం తాను ఒంటరిగా తీసుకున్న నిర్ణయం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ఏకవ్యక్తి తీసుకున్న నిర్ణయం కావడం వల్లే నోట్లరద్దు, జీఎస్టీ ప్రయోగాలు వైఫల్యం చెందాయన్న విమర్శకులకు ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు.
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో సోమవారం నిర్వహించిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. ‘‘జీఎస్టీ నిర్ణయం నా ఒక్కడిదికాదు. కాంగ్రెస్‌తోపాటు దాదాపు 30 రాజకీయ పార్టీలు మద్దతు పలకడం వల్లే చట్టం రూపొందింది. ఈ విషయాన్ని విస్మరించిన కొందరు నన్ను తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జీఎస్టీపై దుష్ప్రచారం చేస్తోంది. మతతత్వం, వర్గవిభేదాలు, ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే కాంగ్రెస్ లక్ష్యాలు. యూపీఏ పాలనలో ఎలాంటి ప్రగతి సాధించలేని కాంగ్రెస్ నేతలు.. నేడు బీజేపీ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారంటూ’’ ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment