
సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గా రెడ్డి
సంగారెడ్డి: వెయ్యి, రెండు వేల రూపాయలకు ఆశపడి టీఆర్‌ఎస్‌కు ఓటు వేయవద్దని సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి ప్రజలను కోరారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..రాజకీయాల్లో తాను ఏమీ సంపాదించలేదని, సంపాదించిందంతా పేదలకు పంచి పెట్టానని వెల్లడించారు. తనకు కనీసం సొంతిల్లు కూడా లేదని తెలిపారు. పేదల బతుకులు బాగు పడాలనే సోనియా తెలంగాణ ఇచ్చిందని అన్నారు.
టీఆర్‌ఎస్ నేతల మాయమాటలు నమ్మవద్దని సూచించారు. జగ్గారెడ్డిని ఎదుర్కొనే ధైర్యం టీఆర్‌ఎస్ నేతలకు లేదని, తాను ఎవరికీ లాలూచీ పడే వ్యక్తిని కాదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసి మహాకూటమిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అందరి జీవితాలు బాగుపడతాయని వ్యాక్యానించారు. కేసీఆర్, హరీష్ రావుల నుంచి తనకు ప్రమాదం పొంచి ఉందని ఆరోపణలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment