
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ నిమిత్తం పలువురు వ్యక్తులు, సంస్థల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ‘గులాబీ కూలీ’ పేరుతో పెద్దమొత్తాల్లో డబ్బు వసూలుచేసి, అక్రమాలకు పాల్పడ్డారని, దీనిపై ఏసీబీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమ వసూళ్లపై తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకునేలా ఏసీబీ అధికారులను ఆదేశించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏసీబీ డీజీ, డీఎస్‌పీలను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై హైకోర్టు బుధవారం విచారణ జరపనుంది.