సంపత్‌కుమార్‌ను సన్మానిస్తున్న బట్టి విక్రమార్క, జైపాల్‌రెడ్డి, వీహెచ్ తదితరులు
స్టేషన్ మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఏఐసీసీ కార్యదర్శిగా ని యమితులైన అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సన్మాన సభ శనివారం జిల్లాకేంద్రంలోని క్రౌన్‌గార్డెన్స్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించారు. ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ అధ్యక్షతన జరిగిన సన్మాన సభకు ముఖ్య అతిథిగా పా ల్గొన్న భట్టి విక్రమార్క మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలను ప్రస్తావించడం లో సంపత్‌కుమార్ చురుగ్గా వ్యవహరిస్తారన్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ అసెంబ్లీలో త న వాణి వినిపిస్తూ అందరి దృష్టిని ఆకర్శిస్తారన్నా రు. ఒక పక్క నిరుద్యోగ యువత, మరోపక్క రైతులు నిరాశలో ఉన్నారని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల కోసం రూ.1.10 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులమయంగా మారుస్తున్నారని విమర్శించారు. పార్టీ బలోపేతం కోసం నేతలు, కార్యకర్తలు పాటుపడాలని కోరారు.
హామీ విస్మరించిన కేసీఆర్
అధికారంలోకి వచ్చిన వెంటనే దళితుడిని సీఎం చేస్తానని ప్రకటించిన కేసీఆర్ దానిని విస్మరించారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు విమర్శించారు. దళితులకు అంతగా అనుభవం లేదని చెప్పి వారిని మోసం చేశారని ఆరోపించారు. కానీ రాహుల్‌గాంధీ ఒక దళిత ఎమ్మెల్యేను ఏఐసీసీ కార్యదర్శిగా నియమాకం చేశారన్నారు. పార్టీలో అన్నివర్గాలకు సమాన అవకాశాలు లభిస్తాయన్నారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన మర్రి చెన్నారెడ్డి, మల్లికార్జున్‌లను మరువకూడదన్నారు. మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ చేస్తున్న అవినీతిని ఎండగట్టడానికే కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. సోనియాగాంధీ దయవల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అవినీతిపరులు జైలుకు వెళ్లకతప్పదని ఆయన హెచ్చరించారు.
వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ సంపత్‌కుమార్ కార్యకర్త స్థాయి నుంచి ఏఐసీసీ కార్యదర్శిగా నియామకం కావడం సంతోషంగా ఉందన్నారు. మాజీ ఎంపీ మల్లురవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందన్నారు. సన్మానసభలో రాష్ట్ర ఓబీసీ సెల్ చైర్మన్ చిత్తరంజన్‌దాస్, మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్‌రెడ్డి, వంశీకృష్ణ, డీసీసీబీ చైర్మన్ వీరారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కిషన్ తదితరులు ప్రసంగించారు. అనంతరం ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను అన్ని అనుబంధ విభాగాల ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.
అంతకు ముందు సంపత్‌కుమార్ తన రాజకీయ గురువు ఎమ్మెల్యే చిన్నారెడ్డికి పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా సంపత్‌కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడుతామన్నారు. రాహుల్‌గాంధీ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్, సురేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, బెనహర్, అనిత, మణెమ్మ, జగదీశ్వర్‌రావు, ప్రదీప్‌కుమార్‌గౌడ్, గౌస్ రబ్బాని, రవీందర్‌రెడ్డి, అంజనమ్మ, జగన్‌మోహన్‌రెడ్డి, జహీర్ అక్తర్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీకి పరోక్ష ఓటు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువు అయితే సీ ఎం కేసీఆర్ శిష్యుడిలా వ్యవహరిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అవిశ్వా సం సందర్భంగా పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ప్రవర్తన అలాగే ఉందన్నారు. కేసీఆర్‌కు ఓటేస్తే పరోక్షంగా బీజేపీకి ఓటేసినట్లేనన్నారు. సంపత్‌కుమార్ కు ఏఐసీసీ పదవి రావడం సంతోషంగా ఉందన్నారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలో ఎన్‌డీయేతర ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment