
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నారని, టీఆర్‌ఎస్‌ది అవినీతి పాలన అని కేసీఆర్ గుర్తించినందుకు సంతోషమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అవినీతి తగ్గించేందుకే కొత్త రెవెన్యూ చట్టమని కేసీఆర్ చెబుతున్నారని, అంటే ఇప్పటివరకు అవినీతి జరిగిందని ఒప్పుకున్నట్టే కదా అని ఆయన ప్రశ్నించారు. బుధవారం అసెంబ్లీ మీడియా హాల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment