కాంగ్రెస్‌ :అసెంబ్లీ టికెట్‌ కోసం 38లక్షలు వసూలు | Congress Party Women Leader Complaint on Assembly Ticket Fraud | Sakshi

అసెంబ్లీ టికెట్‌ కోసం రూ.38లక్షలు వసూలు

Jul 16 2020 11:26 AM | Updated on Jul 16 2020 11:26 AM

Congress Party Women Leader Complaint on Assembly Ticket Fraud - Sakshi

వరంగల్‌: గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఇప్పిస్తానని కాంగ్రెస్‌ గ్రేటర్‌ వరంగల్‌ ముఖ్యనేత డబ్బు తీసుకున్నాడని మహిళా నేత ఒకరు ఆరోపించారు. ఈ విషయమై బుధవారం పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్‌ స్థానానికి టికెట్‌ ఇప్పిస్తానని సదరు నాయకుడు తన వద్ద రూ.38 లక్షలు తీసుకున్నట్లు తెలిపారు. అయితే, అసెంబ్లీ టికెట్‌ చేజారగా, జెడ్పీటీసీగా పోటీ చేసిన సమయంలో కూడా ఎన్నికల ఖర్చు కోసం ఎన్నిసార్లు అడిగినా డబ్బు తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరకు రూ.26లక్షలు ఇచ్చినా, మిగిలిన డబ్బు కోసం ఇచ్చిన చెక్‌లు బౌన్స్‌ అయ్యాయని తెలిపారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేయగా, వారం రోజుల్లో న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement