క్రిష్టోఫర్ విలీ
ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారాన్ని తస్కరించి.. ఎన్నికల్లో చీటింగ్‌కు పాల్పడిన కేంబ్రిడ్స్ అనాలిటికా సంస్థతో కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు ఉన్నాయా? అంటే ఔననే అంటున్నారు ఆ సంస్థ మాజీ ఉద్యోగి క్రిష్టోఫర్ విలీ. భారత్‌లో తాము విస్తారంగా పనిచేశామని, కాంగ్రెస్‌పార్టీ కూడా తమ క్లయింట్‌గా ఉన్నదని తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు. భారత్‌లో తమకు కార్యాలయం కూడా ఉందని, అన్ని రకాల ప్రాజెక్టులు చేపట్టామని ఆయన వెల్లడించారు. ఆయన మంగళవారం బ్రిటన్ చట్టసభ ఎంపీల కమిటీ విచారణకు హాజరై పలు వివరాలు వెల్లడించారు.
కేంబ్రిడ్జ్ అనాలిటికా సంస్థ ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారాన్ని తస్కరించి.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా ఆ సమాచారాన్ని వాడినట్టు వెల్లడి కావడం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అలాగే బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఇదే విధానాన్ని ఉపయోగించినట్టు వెలుగుచూడటం బ్రిటన్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలో ఈ వివరాలను వెల్లడించి విజిల్ బ్లోయర్‌గా వ్యవహరించిన క్రిష్టోఫర్ విలీ తాజాగా బ్రిటన్ ఎంపీల కమిటీ ముందు హాజరై.. పలు వివరాలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment