సాక్షి, బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాజయంపాలైన కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను అన్వేషిస్తోంది. దీనిలో భాగంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలపై సమీక్షించిన ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి వీరప్పమొయిలీ... పార్టీ ఓటమికి కారణాలను వివరించారు. జేడీఎస్‌తో పొత్తు కారణంగానే కాంగ్రెస్ దారుణను పరాజయం చవిచూసిందన్నారు. రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వంపై ఉన్నవ్యతిరేకత తమ పార్టీపై చూపిందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేసి ఉంటే 15-16 స్థానాల్లో సునాయాసంగా విజయం సాధించే అవకాశం ఉండేదని మొయిలీ అభిప్రాయపడ్డారు.
కాగా చిక్కబళ్లాపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన ఆయన బీజేపీ అభ్యర్థి బీఎస్ గౌడపై ఓటమిపాలైన విషయం తెలిసిందే. అక్కడ కూడా జేడీఎస్‌తో పొత్తు లేకుండా ఉంటే తాను ఖచ్చితంగా గెలుపొందేవాడినని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 28 స్థానాల్లో కాంగ్రెస్ కేవలం ఒకేఒక్క స్థానంలో గెలుపొందిన విషయ తెలిసిందే. బీజేపీ 25 సీట్లను సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment