Verappa Moily
-
‘నిఖిలేశ్వర్’కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
న్యూఢిల్లీ: సాహిత్య రంగంలో విశేష రచనలకు ఏటా అందించే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను మొత్తం 20 మందికి సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించింది. తెలుగులో దిగంబర విప్లవ కవిగా సాహితీ ప్రపంచంలో గుర్తింపు పొందిన నిఖిలేశ్వర్‌ను ఈ ఏడాది కేంద్రం సాహిత్య పురస్కారం వరించింది. ఆయన రచించిన అగ్నిశ్వాసకుగాను ఈ పురస్కారం లభించింది. నిఖిలేశ్వర్ అసలు పేరు కుంభం యాదవరెడ్డి. ఆయన కలం పేరు నిఖిలేశ్వర్. దిగంబర కవుల్లో ఒకరిగా పేరుపొందారు. ఇక, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ కూడా సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. శ్రీ బాహుబలి అహింసా దిగ్విజయం అనే గ్రంథానికి గాను మొయిలీకి ఈ అవార్డు ప్రదానం చేశారు. నిఖిలేశ్వర్‌తో పాటు కన్నెగంటి అనసూయకు బాలసాహితీ పురస్కారం లభించింది. ఆమె రచించిన రచించిన "స్నేహితులు" లఘు కథల సంపుటికిగాను ఈ అవార్డు లభించింది. అలానే ఎండ్లూరి మానసకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. ఆమె రచించిన "మిలింద" లఘు కథల సంపుటికి అవార్డు లభించింది. విజేతలకు కేంద్ర సాహిత్య అకాడమీ లక్ష రూపాయల నగదు, తామ్రపత్రం అందజేయనుంది. -
కాంగ్రెస్‌లో మూకుమ్మడి రాజీనామాలు
న్యూఢిల్లీ : అధ్యక్ష పదవికి రాజీనామాపై పట్టువీడని రాహుల్ గాంధీకి నచ్చజెప్పేందుకు ఆ పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ రాహుల్ మాత్రం రాజీనామాపై వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నేతలు పీసీ చాకో, షీలా దీక్షిత్, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, జేపీ అగర్వాల్, మహాబల్ మిశ్రా, అర్విందర్ లవ్లీ తదితరులు కలిసి శుక్రవారం మరోసారి రాహుల్ నివాసానికి వెళ్లారు. రాజీనామా అంశంపై రాహుల్‌తో భేటీ అయ్యారు. ఇప్పటికే వివేక్ తంఖా పార్టీ లా, ఆర్టీఐ సెల్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. మరోవైపు.. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగాలంటూ.. పార్టీ యువజన విభాగం నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ఇందులో భాగంగా.. నేడు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి రాహుల్ నివాసం వరకు ర్యాలీ చేపట్టనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 500 మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అనంతరం వీరంతా రాహుల్‌ను కలిసి రాజీనామా వెనక్కి తీసుకోవాలని అభ్యర్థించనున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. ఆ భేటీలో ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే విషయంలో రాహుల్ గాంధీ తన అభిప్రాయాన్ని మార్చుకునేందుకు ఒక్క శాతం అవకాశం కూడా లేదంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ. తొలిసారి రాహుల్ గాంధీ రాజీనామ అంశంపై మీడియాతో మాట్లాడారు మొయిలీ. రాజీనామా విషయంలో రాహుల్ గాంధీ వెనక్కి తగ్గేలా లేరన్నారు. ఇక మీదట ఆయన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఒక్క శాతం అవకాశం కూడా లేదన్నారు. త్వరలోనే రాహుల్ రాజీనామా అంశంలో సీడబ్ల్యూసీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. లేదంటే ఇలాంటి ఊహాగానాలు పెరుగుతాయని తెలిపారు. అయితే రాహుల్ రాజీనామాను ఆమోదించేలోపే ఆ పదవికి మరో వ్యక్తిని ఎన్నుకుంటారన్నారు. -
వారితో పొత్తు కారణంగానే దారుణ ఓటమి..
సాక్షి, బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాజయంపాలైన కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను అన్వేషిస్తోంది. దీనిలో భాగంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలపై సమీక్షించిన ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి వీరప్పమొయిలీ... పార్టీ ఓటమికి కారణాలను వివరించారు. జేడీఎస్‌తో పొత్తు కారణంగానే కాంగ్రెస్ దారుణను పరాజయం చవిచూసిందన్నారు. రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వంపై ఉన్నవ్యతిరేకత తమ పార్టీపై చూపిందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేసి ఉంటే 15-16 స్థానాల్లో సునాయాసంగా విజయం సాధించే అవకాశం ఉండేదని మొయిలీ అభిప్రాయపడ్డారు. కాగా చిక్కబళ్లాపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన ఆయన బీజేపీ అభ్యర్థి బీఎస్ గౌడపై ఓటమిపాలైన విషయం తెలిసిందే. అక్కడ కూడా జేడీఎస్‌తో పొత్తు లేకుండా ఉంటే తాను ఖచ్చితంగా గెలుపొందేవాడినని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 28 స్థానాల్లో కాంగ్రెస్ కేవలం ఒకేఒక్క స్థానంలో గెలుపొందిన విషయ తెలిసిందే. బీజేపీ 25 సీట్లను సొంతం చేసుకుంది. -
రాహుల్: వీరప్ప మొయిలీ కీలక హింట్!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు నెహ్రూ-గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నేత ఎం వీరప్ప మొయిలీ వెల్లడించారు. అంతర్గత ఎన్నికల ప్రక్రియ ద్వారా పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ ఎన్నిక కానున్నారని తెలిపారు. వచ్చేనెలలోనే రాహుల్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టవచ్చునని ఆయన సంకేతాలు ఇచ్చారు. రాహుల్ పార్టీ పగ్గాలు చేపడితే.. పార్టీ తీరు మారే అవకాశముంటుందని, ఇది గేమ్ చేంజర్ అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ వెంటనే పార్టీ పగ్గాలు చేపట్టాలని, అది పార్టీకి, దేశానికి మంచిదని ఆయన పీటీఐ వార్తాసంస్థతో అన్నారు. వచ్చేనెల రాహుల్ పార్టీ అధ్యక్షుడి పగ్గాలు చేపట్టవచ్చా? అన్న ప్రశ్నకు ఆ అవకాశముందని మొయిలీ పేర్కొన్నారు. ఈ నెలలో రాష్ట్రాలలో పార్టీ అంతర్గత ఎన్నికల ప్రక్రియ పూర్తికానుందని, వచ్చేనెల ఏఐసీసీ స్థాయిలో అంతర్గత ఎన్నిక జరుగుతుందని, అనంతరం రాహుల్ పగ్గాలు చేపట్టనున్నారని తెలిపారు.