రాహుల్‌: వీరప్ప మొయిలీ కీలక హింట్‌! | Rahul Gandhi Must Take Charge Now, says verappa moily | Sakshi
Sakshi News home page

రాహుల్‌: వీరప్ప మొయిలీ కీలక హింట్‌!

Published Fri, Sep 15 2017 4:57 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

రాహుల్‌: వీరప్ప మొయిలీ కీలక హింట్‌! - Sakshi

రాహుల్‌: వీరప్ప మొయిలీ కీలక హింట్‌!

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు నెహ్రూ-గాంధీ కుటుంబ వారసుడు రాహుల్‌ గాంధీ సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ సీనియర్‌ నేత ఎం వీరప్ప మొయిలీ వెల్లడించారు. అంతర్గత ఎన్నికల ప్రక్రియ ద్వారా పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ ఎన్నిక కానున్నారని తెలిపారు. వచ్చేనెలలోనే రాహుల్‌ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టవచ్చునని ఆయన సంకేతాలు ఇచ్చారు. రాహుల్‌ పార్టీ పగ్గాలు చేపడితే.. పార్టీ తీరు మారే అవకాశముంటుందని, ఇది గేమ్‌ చేంజర్‌ అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్‌ వెంటనే పార్టీ పగ్గాలు చేపట్టాలని, అది పార్టీకి, దేశానికి మంచిదని ఆయన పీటీఐ వార్తాసంస్థతో అన్నారు.

వచ్చేనెల రాహుల్‌ పార్టీ అధ్యక్షుడి పగ్గాలు చేపట్టవచ్చా? అన్న ప్రశ్నకు ఆ అవకాశముందని మొయిలీ పేర్కొన్నారు. ఈ నెలలో రాష్ట్రాలలో పార్టీ అంతర్గత ఎన్నికల ప్రక్రియ పూర్తికానుందని, వచ్చేనెల ఏఐసీసీ స్థాయిలో అంతర్గత ఎన్నిక జరుగుతుందని, అనంతరం రాహుల్‌ పగ్గాలు చేపట్టనున్నారని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement