సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందరికి టెస్టులు చేయాలనే ఏడుపుగొట్టు సలహాలను చంద్రబాబు ఇవ్వొదని, ఎవరెవరికి పరీక్షలు అవసరమో వైద్య నిపుణులకు తెలుసన్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే తండ్రీ కొడుకులు వచ్చి టెస్టులు చేయించుకోవాలని సలహా ఇచ్చారు. ఈ మేరకు వరస ట్వీట్లు చేశారు.
‘ఏడాది కింద కరోనా వచ్చుంటేనా. పచ్చ మీడియాను వెంటేసుకుని క్వారంటైన్ వార్డుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవాడు. డాక్టర్లను మందలించడం, నేను రాకపోతే పరిస్థితి ఏమిటని నిలదీయడాలు. ఇలాంటి సిఎం మాకు లేడే అని మహారాష్ట్ర, కేరళ ప్రజలు శోకాలు పెట్టినట్టు. ఆ వేషాలు చెప్పనలవి కాకుండా ఉండేవి’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
‘కరోనా లక్షణాలు కనిసిస్తే తండ్రీ కొడుకులు వచ్చి టెస్టులు చేయించుకోండి. కొత్తగా 3 కరోనా నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేయించారు సిఎం జగన్ గారు. క్వారెంటైన్ సౌకర్యాలు కూడా పెరిగాయి. అందరికి టెస్టులు చేయాలనే ఏడుపుగొట్టు సలహాలొద్దు. ఎవరికి పరీక్షలవసరమో వైద్య నిపుణులకు తెలుసు’ అని ఎద్దేవా చేశారు.
‘హైదరాబాద్ లో స్టార్ హోటల్ కి చెల్లించిన బిల్లులు, పది కోట్ల ప్రత్యేక బస్సు (కారవాన్), హిమాలయ వాటర్ కు పెట్టిన ఖర్చుతో వెయ్యి వెంటిలేటర్లు వచ్చేవి. కొనాలన్నా వెంటనే లభ్యం కాని పరిస్థితి ఇప్పుడు. ప్రజాధనాన్ని దుబారా చేసి మీ కర్మ-మీరు చావండని పారిపోయిన వ్యక్తి విజనరీ అంట!’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment