
సాక్షి, అనంతపురం : తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆ పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం అనంతపురంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. యనమలకు రెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు, పరిటాల, పయ్యావుల కుటుంబాలకు బీర్ల ఫ్యాక్టరీ లైసెన్సులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు వ్యతిరేకమని, ఈ విషయాన్ని ఎక్కడైనా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం, పోతిరెడ్డిపాడు విస్తరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్, కార్పొరేట్ కళాశాలల్లో జరుగుతున్న విద్యార్థుల మరణాలకు టీడీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని, మంత్రులు నారాయణ, గంటాలపై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. టీడీపీ, టీఆర్ఎస్‌లు రెండూ ఒకటేనని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment