
డేరంగుల ఉదయ్ కిరణ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థిరపడ్డ సీమాంధ్రులకు 20 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలు కేటాయించాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్ డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు లేఖలను రాసినట్లు వివరించారు.
బుధవారం నాంపల్లిలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కోట్లాది మంది సీమాంధ్రులు స్థిరపడినట్లు వివరించారు. ప్రభుత్వానికి అన్ని విధాలుగా పన్నుల రూపంలో సీమాంధ్రులు ఆదాయాన్ని సమకూర్చుతున్నప్పటికీ అధికారంలో భాగస్వామ్యం లేకుండా పోయిందన్నారు. సీమాంధ్ర నుంచి తెలంగాణలో సరైన ప్రజాప్రతినిధి లేకపోవడంతోనే వీరి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment