సాక్షి, హైదరాబాద్: పంచాయతీల్లో ప్రత్యక్ష ఎన్నికల విధానమే సరైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. వార్డు సభ్యుల ద్వారా సర్పంచ్‌ను ఎన్నుకోవడమంటే గ్రామాల్లో కక్షలకు బీజం వేయడమేనని ఆయన హెచ్చరించారు. పంచాయతీరాజ్ చట్ట సవరణపై తొందరపాటు నిర్ణయాలు వద్దన్నారు. దీనిపై అన్ని పార్టీలతో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. పదవీకాలం పూర్తయిన సహకార సంఘాలకు ఎన్నికలను నిర్వహించకుండా గడువు ఉన్న పంచాయతీలకు ఎన్నికలంటూ హడావుడి చేయడం సరికాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment