
సోమవారం ముంబైలోని బోరివెలీ రైల్వేస్టేషన్‌లో ఊర్మిళ వాగ్వాదం
ముంబై: నార్త్ ముంబై కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, సినీ నటి ఊర్మిళా మటోండ్కర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బోరివెలీ రైల్వేస్టేషన్ సమీపంలో ఆమె ర్యాలీ నిర్వహిస్తుండగా కొందరు అనుచితంగా ప్రవర్తించారు. ‘మేం ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో సుమారు 25 మంది బీజేపీ మద్దతుదారులు పార్టీ జెండాలతో ర్యాలీలోకి చొచ్చుకువచ్చారు. మోదీ పేరిట నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలకు మధ్య వివాదం చెలరేగింది. బీజేపీ కార్యకర్తలు అసభ్యకర రీతిలో డ్యాన్సులు చేశారు’అని ఊర్మిళ మండిపడ్డారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment