
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్‌రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఎమ్మెల్యే డీకే అరుణ ఖండించారు. ఆమె బుధవారం అసెంబ్లీ లాబీలో మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ...‘ రేవంత్ రాకను నేనెందుకు వ్యతిరేకిస్తాను. వ్యతిరేకించేవారెవరైనా ఉంటే నా పేరు చెబుతున్నారేమో. రేవంత్‌కు పదవులు ఇవ్వొద్దని నేనెందుకంటాను. కొడంగల్‌కు ఉప ఎన్నిక వస్తుందని నేను అనుకోవడం లేదు.’ అని అన్నారు. కాగా రేవంత్‌రెడ్డి రాక పట్ల ఎమ్మెల్యే డీకే అరుణ అసంతృప్తితో ఉన్నట్టు ఇంతకుముందు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీకి గుడ్‌బై చెప్పిన రేవంత్ రెడ్డి నిన్న (మంగళవారం) కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment