చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్ కొందరి చేతుల్లో తోలు బొమ్మగా మారారని.. మతతత్వ అంశాలకు మద్దతిస్తున్నారని డీఎమ్‌కే ఆరోపించింది. ఈ సందర్భంగా డీఎమ్‌కే, తన పార్టీ అధికార పత్రిక మురసోలిలో రజనీకాంత్‌ని పలు అంశాల గురించి ప్రశ్నించింది.
ఈ సందర్భంగా ‘మీరు(రజనీకాంత్) రాజకీయాల్లోకి వచ్చే ముందు పాలిటిక్స్‌ను ప్రక్షాలన చేస్తాను. డబ్బు, హోదాలపై నాకు వ్యామోహం లేదని ప్రకటించారు. ఏ పదవులు అక్కరలేదంటున్న మీరు వచ్చే ఎన్నికల్లో 234 స్ధానాల్లో పోటీ చేస్తానని ఎందుకు ప్రకటించారు. మీడియాలో మీ గురించి మాట్లాడేవారంతా మతతత్వ వాదులు. కొంతమంది మీ పేరు వాడుకోని లబ్ధి పొందటానికి ప్రయత్నిస్తున్నారు. వారు తమిళనాడును చీల్చడానికి కుట్ర పన్నుతున్నారు’ అన్నారు.
అంతేకాక ‘అభిమానులుగా మేము మిమ్మల్ని నమ్ముతాం. కానీ మీరు కొందరి చేతుల్లో తోలు బొమ్మగా మారి.. వారు చెప్పినట్టల్లా ఆడుతున్నారు. మిమ్మల్ని అలా ఆడిస్తోన్న ఆ బ్లాక్ షీప్ ఎవరో చెప్పండి. ఓ అమాయకపు అభిమానిగా నేను ఈ ప్రశ్నలు వేస్తున్నాను. సమాధానం చెప్పండి’ అంటూ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment