సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ నెల 4వ తేదీన రేవంత్ కొడంగల్ బంద్‌కు పిలువునివ్వడం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటామని వ్యాఖ్యానించడంపై టీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. రేవంత్ ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్గిస్తున్నారని ఆరోపించారు. ఆయన ఉద్దేశపూర్వకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాలను ఎన్నికల సంఘానికి సమర్పించారు. టీఆర్‌ఎస్ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ రేవంత్‌పై తగు చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. అంతేకాకుండా రేవంత్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో రేపటిలోగా వివరణ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment