ఏ క్షణమైనా ఎన్నికలు : విజయసాయి రెడ్డి | Elections May Come At Anytime Says Vijiayasai Reddy | Sakshi
Sakshi News home page

ఏ క్షణమైనా ఎన్నికలు : విజయసాయి రెడ్డి

Published Sun, Jun 24 2018 3:49 PM | Last Updated on Mon, Aug 20 2018 6:07 PM

Elections May Come At Anytime Says Vijiayasai Reddy - Sakshi

సాక్షి, విజయనగరం : ఏ క్షణమైనా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు రావొచ్చని, అందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి వీ విజయసాయి రెడ్డి సూచించారు. ఆదివారం అరకు వైఎస్సార్‌ సీపీ పార్లమెంటు నియోజకవర్గ బూత్‌ లెవల్‌ కమిటీ సమావేశాలకు పార్టీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డితో కలసి ఆయన హాజరయ్యారు.

విజయనగరం పేరులోనే విజయం ఉందని, జిల్లాలోని ఎంపీ సీటుతో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగరాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు.

ఏపీలోని 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడుల కంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలే విజయవంతమయ్యాయని భూమన కరుణాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. బూత్‌ లెవల్‌ కన్వీనర్లు సైనికుల్లా పని చేయాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement