ఆర్టికల్‌ 370 రద్దు: రాజ్యాంగ నిపుణుడి కీలక వ్యాఖ్యలు | Expert Subhash Kashyap on Article 370, Constitutionally it is sound | Sakshi
Sakshi News home page

ఆర్టికల్‌ 370 రద్దు: రాజ్యాంగ నిపుణుడి కీలక వ్యాఖ్యలు

Published Mon, Aug 5 2019 3:31 PM | Last Updated on Mon, Aug 5 2019 3:32 PM

Expert Subhash Kashyap on Article 370, Constitutionally it is sound - Sakshi

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం చరిత్రాత్మకమైన సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజ్యసభలో ప్రకటన చేశారు. అనంతరం ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ.. రాష్ట్రపతి గెజిట్‌ విడుదల చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగం ప్రకారం చెల్లుతుందా? న్యాయస్థానాల్లో నిలబడుతుందా? అన్నది పలు సందేహాలకు తావిస్తున్న నేపథ్యంలో ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు సుభాష్‌ కశ్యప్‌ ఈ అంశంపై స్పందించారు.

ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం రాజ్యాంగబద్ధంగానే కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో ఈ అంశాన్ని అధ్యయనం చేసి.. ఈ నిర్ణయం తీసుకుందని, ఇందులో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా లోపాలు కనిపించడం లేదని తెలిపారు. అయితే, ఇది రాజకీయ నిర్ణయమా? అన్న ప్రశ్నకు దానిపై తాను సమాధానం చెప్పలేనని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement