Constitutional process
-
India First General Elections: ఆరంభం అదిరింది
స్వాతంత్య్రం వచ్చి అప్పటికి ఐదేళ్లు కూడా దాటలేదు. దేశాన్ని కుదిపేసిన విభజన తాలూకు గాయాల పచ్చి ఇంకా ఆరనే లేదు. ఎటు చూసినా ఇంకా బాలారిష్టాలే. పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న అనేకానేక సమస్యలే. వయోజనుల్లో చదవను, రాయను వచి్చన వారి సంఖ్య చూస్తే అతి స్వల్పం. ఇలా... ఒకటా, రెండా! 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికలకు ఎటు చూసినా సవాళ్లే. ఇన్ని పెను సవాళ్లనూ విజయవంతంగా అధిగమిస్తూ ఆ ఎన్నికలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. దాంతో... ఇది అయ్యేదా, పొయ్యేదా అంటూ పెదవి విరిచిన ఎంతోమంది పాశ్చాత్య విమర్శకుల నోళ్లు మూతలు పడ్డాయి. తొలి ఎన్నికల ఫలితాలొచ్చేదాకా భారత్ రాజ్యాంగబద్ధ రాచరిక దేశంగానే కొనసాగింది! లార్డ్ మౌంట్‌బాటెన్ గవర్నర్ జనరల్‌గా కొనసాగారు. నెహ్రూ సారథ్యంలోని రాజ్యాంగ సభే మధ్యంతర పార్లమెంటుగా వ్యవహరించింది. ఎందుకంటే స్వాతంత్య్రం సిద్ధించిన కొన్నేళ్ల దాకా ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న దానిపై ఓ స్పష్టతంటూ లేదు. నియమ నిబంధనలు గానీ విధివిధానాలు గానీ లేవు. అంబేడ్కర్ సారథ్యంలోని డ్రాఫ్టింగ్ కమిటీ రూపొందించిన రాజ్యాంగం 1949లో ఆమోదం పొంది 1950 జనవరి 26న అమల్లోకి వచ్చాకే ప్రజా ప్రాతినిధ్య చట్టం ద్వారా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓ స్పష్టత ఏర్పడింది. ఆ వెంటనే తొలి ఎన్నికల నిర్వహణకు సుదీర్ఘ కసరత్తు మొదలైంది. ఆ క్రమంలో ఎన్నో సమస్యలు. మరెన్నో సవాళ్లు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు పోలింగ్ సిబ్బందిని, సామగ్రిని చేర్చడమైతే పెద్ద యజ్ఞాన్నే తలపించింది. ఇలాంటి అనేకానేక సవాళ్లను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. పార్టీలు, అభ్యర్థులకు గుర్తులు పారీ్టలకు గుర్తులు కేటాయించాలని తొలి సార్వత్రిక ఎన్నికలప్పుడే ఈసీ నిర్ణయించింది. ఆలయం, ఆవు, జాతీయ పతాకం, రాట్నం వంటి సున్నితమైన గుర్తులు కాకుండా సులభంగా గుర్తించే ఇతర గుర్తుల వైపు మొగ్గు చూపింది. కాంగ్రెస్ అనగానే గుర్తుకొచ్చే హస్తం గుర్తు ఆ పార్టీకి 1980లో వచి్చంది. 1952లో కాంగ్రెస్ కాడెద్దుల గుర్తుపై పోటీ చేసింది. విడిపోయిన వేళ్లతో కూడిన హస్తం గుర్తు ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ (రుయ్‌కార్ గ్రూప్)కు దక్కడం విశేషం! సోషలిస్ట్ పార్టీకి చెట్టు, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీకి గుడిసె, అఖిల భారతీయ రామరాజ్య పరిషత్‌కు ఉదయించే సూర్యుడు వంటి గుర్తులు దక్కాయి. ఫలితాలిలా... భారత జాతీయ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)తో పాటు సోషలిస్టు పార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, అఖిల భారతీయ హిందూ మహాసభ వంటి మొత్తం 53 పార్టీలు తొలి ఎన్నికల్లో పోటీ చేశాయి. అయితే అనూహ్యమేమీ జరగలేదు. ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలోని కాంగ్రెసే విజయం సాధించింది. 45 శాతానికి పైగా ఓట్లతో 489 స్థానాలకు గాను ఏకంగా 364 చోట్ల నెగ్గింది. దేశ తొలి ఎన్నికైన ప్రధానిగా కూడా నెహ్రూయే నిలిచారు. కమ్యూనిస్టు పార్టీ 16 స్థానాలు నెగ్గి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. అంబేడ్కర్‌కు ఓటమి రాజ్యాంగ రూపశిల్పి బీఆర్ ఆంబేడ్కర్‌కు తొలి ఎన్నికలు చేదు అనుభవమే మిగిల్చాయి. నార్త్ సెంట్రల్ బోంబే స్థానం నుంచి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన తన సహాయకుడే అయిన కాంగ్రెస్ అభ్యర్థి నారాయణసబోద కజ్రోల్కర్ చేతిలో 15,000 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు! సోషలిస్ట్ పార్టీ మద్దతున్నా సీపీఐ అభ్యర్థి డంగే అంబేడ్కర్‌కు వ్యతిరేకంగా బలంగా ప్రచారం చేశారు. దీనికి నెహ్రూ గాలి తోడవడంతో కజ్రోల్కర్ నెగ్గారు. 1954లో బండారా లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లోనూ మరోసారి కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలయ్యారు. చివరికి జన్‌సంఘ్ సాయంతో అంబేడ్కర్ రాజ్యసభలో అడుగుపెట్టారు. ► దేశ తొలి ఎన్నికల ప్రక్రియ 1951 అక్టోబర్ 25న మొదలైంది. 1952 ఫిబ్రవరి 21 దాకా ఏకంగా నాలుగు నెలల పాటు కొనసాగింది. ► అప్పట్లో మొత్తం 489 లోక్‌సభ స్థానాలుండేవి. ► 17.3 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారు. ► 53 పారీ్టల తరఫున 1,874 మంది బరిలో నిలిచారు. ► అప్పట్లో భారత్‌లో అక్షరాస్యత కేవలం 16.6 శాతమే! ► దేశవ్యాప్తంగా 1,32,560 పోలింగ్ స్టేషన్లు, 1,96,084 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ► ముందుగా హిమాచల్‌ప్రదేశ్‌లో తొలి దశలో పోలింగ్ జరిగింది. ► మొత్తమ్మీద 51 శాతం పోలింగ్ నమోదైంది. 8,86,12,171 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► అప్పట్లో ఓటరుగా నమోదయ్యేందుకు కనీస వయో పరిమితి 21 ఏళ్లుగా ఉండేది. ► అప్పటికి ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఓటింగ్ ప్రక్రియ 1952 ఎన్నికలు రికార్డులకెక్కాయి. నాటినుంచి నేటిదాకా ఈ రికార్డు భారత్పేరిటే కొనసాగుతూ వస్తోంది. ఒకే ఒక్కడు... తొలి ఎన్నికల క్రతువు దిగ్విజయంగా సాగిందంటే అందుకు ప్రధాన కారకుడు దేశ తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్. ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి అయిన ఆయన 1950లో సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. అనేక ప్రతికూలతలను అధిగమిస్తూ దేశాన్ని ఎన్నికలకు సన్నద్ధం చేశారు. ఏకంగా 36 కోట్ల జనాభా, 17 కోట్ల పై చిలుకు అర్హులైన ఓటర్లు! వారందరికీ ఓటరు కార్డుల జారీ, ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్ల వంటి అనేకానేక సవాళ్లను సేన్ విజయవంతంగా ఎదుర్కొన్నారు. 84 శాతానికి పైగా ప్రజలు నిరక్షరాస్యులే కావడంతో వారిని గుర్తించి, ఓటర్లుగా నమోదు చేయించడమే ఓ భారీ యజ్ఞాన్ని తలపించింది. 1951 జనగణన ఆధారంగా లోక్‌సభ స్థానాలను ఖరారు చేశారు. రాజస్తాన్‌లోని జైసల్మేర్, జో«ద్‌పూర్ వంటి ప్రాంతాలకైతే ఎన్నికల సామగ్రి తరలింపునకు ఒంటెలను వాడాల్సి వచ్చింది! డాటరాఫ్, వైఫాఫ్...! ఓటర్ల నమోదు సందర్భంగా ఓ సన్నివేశం అప్పట్లో పరిపాటిగా మారింది. ఎన్నికల సిబ్బందికి తమ పేరు చెప్పేందుకు మహిళలు ససేమిరా అనేవారు. అపరిచితులకు తమ పేర్లను చెప్పేందుకు వారు వెనుకాడేవారు. ఫలానా వారి భార్య అనో, కూతురు అనో మాత్రమే చెప్పేవారు. దాంతో విధిలేక ఓటర్ లిస్టులో వారి పేర్లను కూడా అలాగే నమోదు చేయాల్సి వచి్చంది. కానీ ఇలా పేర్లు లేకుండా ఓటరు కార్డులు జారీ చేసేందుకు ఈసీ నిరాకరించింది. అసలు పేర్లతో ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కలి్పంచింది. నాడు 8 కోట్ల మహిళా ఓటర్లు ఉంటే, 20–80 లక్షల మంది తమ అసలు పేర్లను వెల్లడించేందుకు అంగీకరించలేదు. దాంతో వాటిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని ఈసీ నిర్ణయించింది. నాడు తీసుకున్న నిర్ణయం కఠినమైనదే అయినా, ఫలితాలను ఇప్పుడు చూస్తున్నామని, పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొంటున్నట్టు ఢిల్లీ మాజీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ చంద్రభూషణ్ కుమార్ పేర్కొనడం గమనార్హం. అభ్యర్థికో బ్యాలెట్ బాక్సు...! 84 శాతం మంది నిరక్షరాస్యులే. దాంతో ఓటేయాల్సిన అభ్యర్థిని వారు గుర్తించడమెలా అన్నది పెద్ద సమస్యగా నిలిచింది. ఒక్కో అభ్యర్థికీ ఒక్కో రంగు బ్యాలెట్ బాక్సు కేటాయించడం ద్వారా దీన్ని అధిగమించారు. ఆ రంగుపైనే సదరు అభ్యర్థి పేరు, గుర్తు ముద్రించారు. ప్రచార సమయంలో ప్రతి అభ్యర్థీ తన బ్యాలెట్ బాక్సు రంగు ఫలానా అంటూ ప్రముఖంగా ప్రస్తావించేవాడు! ఎన్నికలు.. విశేషాలు ► 1993లో మొదటిసారి ఓటర్ ఐడీని ప్రవేశపెట్టారు. ► ఈవీఎం మెషిన్లపై అభ్యర్థుల ఫొటోలను 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు పెట్టారు. ► నోటా (నన్ ఆఫ్ ద ఎబోవ్/పైన ఎవరూ కాదు) ఆప్షన్‌ను తొలిసారి 2013లో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నుంచి (ఛత్తీస్‌గఢ్, మిజోరాం, రాజస్తాన్, మధ్యప్రదేశ్) అమల్లోకి తీసుకొచ్చారు. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా నోటా అమలుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరికీ ఓటు వేయడం ఇష్టం లేకపోతే నోటాను ఎంపిక చేసుకోవచ్చు. ► దేశ తొలి మహిళా చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఎస్. రమాదేవి 1990 నవంబర్ 26 నుంచి 1990 డిసెంబర్ 11 వరకు పనిచేశారు. ► ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం దేశంలో 7 జాతీయ పారీ్టలు, 27 రాష్ట్ర పార్టీలు, 2,301 నమోదు చేసుకున్న గుర్తింపు లేని పారీ్టలు ఉన్నాయి. ► 31,83,325 ఓటర్లతో దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా మాల్కాజ్‌గిరి ఉంది. 46,909 మంది ఓటర్లతో లక్షద్వీప్ అతి చిన్న లోక్‌సభ స్థానంగా ఉంది. ► విస్తీర్ణపరంగా 1,73,266 చదరపు కిలోమీటర్లతో లద్దాఖ్ అతిపెద్ద లోక్‌సభ స్థానం. 10 కి.మీ. విస్తీర్ణంతో చాందినీ చౌక్ అతి చిన్న నియోజకవర్గంగా ఉంది. ► లోక్ఐసభకు యూపీ అత్యధికంగా 80 మంది ఎంపీలను పంపుతోంది. అంతేగాక దేశానికి ఎనిమిది మంది ప్రధానులను కూడా అందించింది. ► 2009లో బిహార్‌లోని హాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి జేడీ (యూ)కు చెందిన రాంసుందర్ దాస్ 88 ఏళ్ల వయసులో గెలిచారు. లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గిన అతి పెద్ద వయసు్కనిగా రికార్డు సృష్టించారు. ► 2014లో లోక్‌సభ సభ్యునిగా నెగ్గిన అతి పిన్న వయసు్కనిగా (26 ఏళ్లు) దుష్యంత్ చౌతాలా రికార్డులకెక్కారు. హరియాణాలోని హిసార్ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వైస్రాయ్ టు పార్క్ హయత్
ఇదో పెద్ద కుట్ర కథ. నిడివి ఇప్పటికి పాతికేళ్లు. ఇప్పుడే కథ క్లైమాక్స్‌కు చేరుకుంటున్న సంకేతాలు కనబడుతున్నాయి. మరో రెండు మూడేళ్లలో ముగింపు కార్డు పడొచ్చు. కుట్రలో పుట్టి, కుట్రలో పెరిగి, కుట్రలో పయనించి, తన కుట్రకు తానే బలి కాబోతున్న ఒక ఆసక్తికరమైన రాజకీయ ఇతివృత్తమిది. అంతకు ముందటి రాజకీయ వ్యవస్థ ఊహించి కూడా ఎరుగనంత విశృం ఖల స్థాయి అవినీతి ఈ పాతికేళ్లను సూత్రధారిలా నడిపించింది. వంచన, దగా, వెన్నుపోటు, నమ్మక ద్రోహం, ఆశ్రిత పక్షపాతం, గోబెల్స్ ప్రచారం ఈ కథలోని ఒక్కో అధ్యాయాన్ని నడిపిం చాయి. ఓట్లు కొనుగోలు చేయడం, ప్రజా ప్రతినిధులకు వెల కట్టడం వంటి రాజకీయ గారడీ విద్యలను ఈకాలంలోనే కని పెట్టారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను కూడా తన అవసరా లకు అనుగుణంగా ఏమార్చుకోగలిగే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ రాజకీయ వ్యవస్థ సమకూర్చుకోగలిగింది. ఇటువంటి గంభీర సన్నివేశాల్లో కథను అనూహ్య మలుపులు తిప్పే కొన్ని ఐటమ్ సాంగ్స్ కూడా ఉంటాయి. ఉమ్మడి స్వార్థ ప్రయోజనాలకోసం మీడియా–రాజకీయం ఏకమై ప్రజల కళ్లకు గంతలు కట్టి, ఊరే గడం ఈ కథలోని ప్రత్యేక లక్షణం. ఆనాటి తెలుగు ప్రజల అభిమాన సినీనటుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమునిగా ప్రశంసలందుకున్న ఎన్టీ రామా రావు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగు వారి అభిమాన ‘ధనాన్ని’ రెండు చేతులా ఆర్జించిన తాను, వారి రుణం తీర్చుకోవడానికే పార్టీ పెడుతున్నట్టు ఆయన ప్రకటిం చారు. తొమ్మిది మాసాల్లోనే వచ్చిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయాన్ని సాధించింది. ముక్కుసూటి మనిషి కావడం వలన తాను ముందుగా ప్రకటించినట్టుగానే తన పరిపాలనలో ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేశారు. అడపాదడపా కొన్ని ఆరోపణలు ఎదుర్కోవలసి వచ్చినా తన పార్టీ మౌలిక లక్ష్యాల నుంచి మాత్రం పక్కకు జరగలేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భా వానికీ, విజయానికి దోహదం చేసిన వారిలో కొన్ని స్వార్థపర శక్తులు కూడా ఉన్నాయి. రాజకీయ అనుభవరాహిత్యం కార ణంగా ఎన్టీ రామారావు తమ చెప్పుచేతల్లో ఉంటారని ఈ శక్తులు భావించాయి. కానీ, రామారావు వీరికి లొంగలేదు. దాదాపు ఒక పుష్కరకాలం పాటు ఆయన తన పంథాలోనే కొనసాగారు. ఎన్టీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ శక్తులు తమ కుట్రను అమలుచేశాయి. అధికార లాలసుడైన చంద్ర బాబు కథానాయకుడుగా ఈ కుట్ర కథను రచించాయి. ట్యాంక్ బండ్ తూములను ఆక్రమించి కట్టిన వైస్రాయ్ హోటల్ కథ క్లైమాక్స్ ఘట్టానికి 1995 ఆగస్టు చివరి రోజులలో వేదికగా నిలిచింది. అంతకు ఏడాది ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నిక లప్పుడే భవిష్యత్‌లో చంద్రబాబుకు మద్దతుగా నిలబడేవిధంగా కొందరు అభ్యర్థుల ఎంపిక, వారికి ఆర్థిక సహాయం కూడా గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది. 95 మే, జూన్‌ల నుంచి కుట్ర అమలు కార్యక్రమం ప్రారంభమైంది. గోబెల్స్ ప్రచారాన్ని హిట్లర్‌ను మించి వాడుకున్న అరుదైన ఉదాహ రణగా వైస్రాయ్ ఎపిసోడ్ గుర్తుండిపోయింది. మొదట చంద్ర బాబుకు నమ్మకస్తులైన ఓ పదిమంది ఎమ్మెల్యేలను హోటల్లో ప్రవేశపెట్టారు. తరువాత కొందరు మీడియా ప్రతినిధులు మిగి లిన ఎమ్మెల్యేలందరికీ ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. తెలు గుదేశం పార్టీని ‘ఒక దుష్టశక్తి’ నుంచి రక్షించడానికి ఎమ్మెల్యే లంతా వైస్రాయ్‌లో సమావేశమవుతున్నారు. మీరు రాకపోతే నష్టపోతారని ఆ ఎమ్మెల్యేలను బెదరగొట్టారు. మొబైల్ ఫోన్లు లేని రోజులు. క్రాస్ చెక్ చేసుకునే అవకాశాలు తక్కువ. ఆదు ర్దాతో కొందరు, ఏం జరుగుతుందో తెలుసుకుందామనే కుతూ హలంతో మరికొందరు ఎమ్మెల్యేలు వైస్రాయ్ హోటల్‌కు చేరుకున్నారు. వచ్చినవాళ్లందరినీ హోటల్లోనే బంధించారు. ఆ రకంగా ఒక పాతిక ముప్పయ్ మంది ఎమ్మెల్యేలు వైస్రాయ్ హోటల్లో పోగయ్యారు. కానీ, మరుసటిరోజు పత్రికల్లో ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా వందమందికి పైగా ఎమ్మెల్యేలు వైస్రాయ్‌లో క్యాంపు వేశారని బ్యానర్ వార్తలు వచ్చాయి. దాంతో మరికొన్ని గోడమీది పిల్లులు క్యాంపులో దూకేశాయి. వ్యవస్థలనూ ప్రభావితం చేసే ప్రక్రియ కూడా అప్పటినుంచే ప్రారంభమైంది. వైస్రాయ్‌లో ఉన్న తన ఎమ్మెల్యేలను కలవ డానికి ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చిన ఎన్టీఆర్‌ను పోలీసులు అనుమతించలేదు. రోడ్డుపైనే చైతన్యరథాన్ని నిలుపుకుని హోటల్ లోపల ఉన్న ఎమ్మెల్యేలకు వినిపించేలా మైక్ తీసుకుని మాట్లాడటం మొదలుపెట్టారు. వెంటనే అక్కడ సిద్ధంగా ఉంచిన కిరాయి మూకలు ఎన్టీఆర్ వాహనంపైకి చెప్పులు విసరడం ప్రారంభించాయి. వాళ్లను వదిలేసి ఎన్టీఆర్ వాహనాన్ని పోలీ సులు వెనక్కి మళ్లించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ మభ్యపెట్టి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికవుతారు. బలపరీక్ష రోజు ఎన్టీఆర్‌కు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వ కుండా అవమానించి సభ నుంచి పంపిస్తారు. కలత చెందిన ఎన్టీఆర్ తనపై వెన్నుపోటు కుట్రకు కారకులైన చంద్రబాబు పైన, ఒక పత్రికాధిపతిపైనా తీవ్ర విమర్శలు చేస్తారు. చంద్ర బాబును ఔరంగజేబుతో ఆయన పోల్చారు. ఔరంగజేబు కూడా అధికారంలోకి రావడానికి తండ్రి షాజహాన్‌కు వ్యతిరేకంగా కుట్రచేసి సోదరులైన దారాషికో, మురాద్, షాషుజాలతో వేరు వేరుగా మంత్రాంగం చేస్తాడు. విడివిడిగానే ముగ్గురినీ అంత మొందించి తండ్రిని చెరసాలలో వేసి సింహాసనాన్ని అధిష్టి స్తాడు. సోదరి జహనారాపై కూడా హత్యాప్రయత్నం జరుగు తుంది. ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా జరిగిన వెన్నుపోటు కుట్రలో కూడా ఎన్టీఆర్ మిగిలిన సంతానాన్ని మభ్యపెట్టి భాగస్వాము లను చేశారు. వారికి భవిష్యత్తులో పట్టబోయే దుర్గతిని ఎన్టీఆర్ ముందుగానే ఊహించి చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చారు. తనకు జరిగిన అవమానానికి తీవ్రమైన వ్యథకు లోనై మరో నాలుగు నెలల్లోనే ఆయన కన్ను మూశారు. ఈ కుట్ర ప్రారంభమై ఈ సంవత్సరానికి సరిగ్గా పాతికేళ్లు నిండింది. వెన్ను పోటు దినంగా ప్రకటించడానికి ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరిన ఆగస్టు 27ను తీసుకోవాలా? ఆయనను తొలగించి చంద్ర బాబును టీడీఎల్పీ నేతగా ప్రకటించిన ఆగస్టు 24ని తీసు కోవాలా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సెప్టెంబర్ 1వ తేదీని తీసుకోవాలా అనే విషయాన్ని చరిత్ర కారులు నిర్ణయించాలి. హిరోషిమా పట్టణంపై అమెరికా వాళ్లు ఆటంబాంబును వేసిన ఆగస్టు 6తో సమానమైన దుర్దినం ఈ వెన్నుపోటు దినం. పాతికేళ్ల నుంచీ ఆంధ్రదేశంపై దీని ప్రభావం కనిపిస్తూనే ఉంది. ఈనెల పదమూడో తారీఖునాడు హోటల్ పార్క్ హయత్‌లో జరిగిన ఒక ‘రాజకీయ భేటీ’కి సంబంధించిన వీడియోలు వారం రోజుల తర్వాత బయటపడ్డాయి. మరో రాజకీయ కుట్రకు సంబంధించిన ‘టిప్ ఆఫ్ ఐస్‌బర్గ్’గా ఈ వీడియో దృశ్యాలను రాజకీయ పరిశీలకులు పరిగణిస్తున్నారు. ఈ తాజా కుట్రకు కారణం ఏమై ఉంటుంది? వెన్నుపోటు ఘట్టం నాటినుంచి నేటిదాకా చంద్రబాబు నేతృత్వంలో తెలుగు దేశం ప్రయాణం వివరాలు అర్థమైన వారికి తాజా కుట్రకు కార ణాలు కూడా అర్థమవుతాయి. కొంతమంది స్వార్థ ప్రయోజ నాల కోసమే ఎన్టీఆర్‌ను అనైతికంగా తొలగించి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్ పదవీచ్యుతితోనే ఆ పార్టీ మౌలిక లక్ష్యం అటకెక్కింది. అనైతిక లక్ష్యంకోసం, అనైతిక పద్ధతిలో ఏర్పడిన రాజకీయ వ్యవస్థ పయనం కూడా అనైతిక దారుల్లోనే సాగుతుంది. తెలుగుదేశం పార్టీ ఈ పాతికేళ్ల ప్రస్థానం అలాగే సాగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన మొదటి తొమ్మిదేళ్ల సీజన్ ఒక జనజీవన విధ్వంస కాలం. వ్యవసాయ క్షేత్రాలు మరుభూములుగా మారిన దురదృష్టకర రోజులు. చేతివృత్తులు శిథిలమై ప్రజలు బతుకుదెరువు బాట పట్టగా మొండి గోడలతో పల్లెలు మిగిలిపోయిన విషాద అధ్యాయం అది. నాటి దుస్థితికి ప్రజాకవి గోరటి వెంకన్న రాసిన ‘పల్లే కన్నీరు పెడుతుందో.. కనిపించని కుట్రల’ అనే పాట అద్దం పట్టింది. రాజకీయాల్లో ఓటుకు నోటు రాజ్య మేలింది. డబ్బున్నవాడే పోటీదారుడు కాగలిగాడు. రాజకీయాల నుంచి సంఘసేవకులు నిష్క్రమించారు. అయినా, అవకాశవాద ఎత్తులు పొత్తులతో చంద్రబాబు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉండగలిగారు. అందులో నాలుగేళ్లు ఎన్టీఆర్ నుంచి తస్కరించి నవి. ఐదేళ్లు వాజ్‌పేయి భిక్ష. మరో ఐదేళ్లు నరేంద్ర మోదీ సంపా దనలో లభించిన వాటా. వరసగా ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి చంద్రబాబు నాయకత్వం వహించారు. రెండుసార్లు బీజేపీ ప్రభంజనంలో గట్టెక్కారు. మూడుసార్లు ఓటమి పాల య్యారు. అందులో రెండుసార్లు పొత్తులున్నప్పటికీ ఓడిపోగా మొన్నటిసారి పరోక్ష పొత్తులతో పోటీచేస్తే కనీవినీ ఎరుగని స్థాయిలో శృంగభంగం జరిగింది.రాష్ట్ర విభజన తర్వాత అదృష్టవశాత్తు చివరిసారి అధికారం దక్కినా, చంద్రబాబు ప్రభుత్వం తన సహజ విధానాల ఫలి తంగా ప్రజలను ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలమైంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అవినీతి విలయ తాండవం చేసింది. దేవుని భూములనూ వదలలేదు. ఇసుకను కూడా పంచదారలా చప్పరించారు. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదు. దళితులు, మహిళలపై దాడులు యథేచ్ఛగా సాగాయి. ఫలితంగా ఎన్నికల్లో దారుణమైన ఓట మిని మూటకట్టుకోవలసి వచ్చింది. ఎన్నికల ఫలితాల కంటే తదనంతర పరిణామాలు తెలుగుదేశం పార్టీని భయకంపితం చేస్తున్నాయి. అవినీతిపై వైఎస్ జగన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతున్నది. కొత్త ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన పాలనా సంస్కరణలు, పూరిస్తున్న సంక్షేమ విప్లవ శంఖారావం ఫలితంగా తెలుగుదేశం పార్టీ పునాదులు కదిలిపోతున్న పరిస్థితి స్పష్టంగా తెలుస్తున్నది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 125 నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌ఛార్జిలు గత ఏడాది కాలంగా జనంలోకి రానేలేదు. మిగిలిన 20 మంది ఎమ్మెల్యేలకు తోడు మరో 30 నియోజకవర్గాల్లోనే అడపాదడపా పార్టీ సందడి కనిపిస్తున్నది. మరో ఆందోళనకరమైన పరిణామం నలభయ్యేళ్లు నిండకముందే పార్టీలో వృద్ధాప్య ఛాయలు కనబడుతున్నాయి. ప్రస్తుతం నలభయ్యేళ్ల లోపు వయసులో ఉండి, కుటుంబ రాజకీయ వారసత్వం లేకుండా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తెచ్చుకునే అవకాశం ఉన్నవారు కేవలం పదినుంచి పదిహేను మంది మాత్రమే. వారిలో అత్యధికులు రిజర్వుడు నియోజకవర్గాలకు చెందినవారు, మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే. కనీసం మండల స్థాయిలో కూడా స్వతంత్రంగా వ్యవహరించగల యువ నాయ కులు తెలుగుదేశం పార్టీలో (కుటుంబ వారసత్వం లేని) కాగడా వేసుకుని గాలించినా పట్టుమని పదిమంది కనిపించడం లేదు. పార్టీ అధినేత తన రాజకీయ వారసునికి పార్టీ కీలక పదవి, మంత్రి పదవి అప్పగించి నెంబర్ టూగా ప్రమోట్ చేసినా కూడా ఐదేళ్ల కాలంలో క్షేత్రస్థాయి యువ నాయకత్వం నామమాత్రంగా కూడా తయారు కాకపోవడం విషాదకర పరిణామం. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో యువనేత పార్టీ సభ్యత్వ పోటీలు నిర్వహించడం, కడుపుబ్బ నవ్వించే కొన్ని కామెడీ సన్నివేశాలను జొప్పించడం మినహా తటస్థ యువతను ఏమాత్రం ఆకర్షించలేక పోయారు. ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో నాలుగేళ్లకు జరిగే ఎన్నికల్లో గెలవడం మాట అటుంచి గట్టిగా పోరాడే శక్తి కూడా అనుమానమే. అధికారానికి శాశ్వతంగా దూర మయ్యే పక్షంలో రాజధాని భూముల్లో ప్రపంచపు అతిపెద్ద ‘ట్రెజర్ హంట్’పై తాము పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలు కావల్సిందేనా అన్న ఆలోచన తెలుగుదేశం కులీన వర్గాన్ని కుంగ దీస్తున్నది. అందుకే, ఒక ద్విముఖ వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ అమలుచేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఒకటి: మొదటినుంచీ తాము అనుసరిస్తున్న గోబెల్స్ దుష్ప్రచారాన్ని మరింత విస్తృతం చేయడం. రెండు: రహస్యంగా ఏదో ఒక ప్రభుత్వ వ్యతిరేక కుట్రను ప్లాన్ చేయడం. బహిరంగ, రహస్య వ్యూహాలైన ఈ రెంటికీ ఈవారం సాక్ష్యాలు దొరికాయి. అక్రమ నిర్మాణంగా నిర్ధారణ అయిన కట్టడాన్ని కూల్చివేస్తే, తెలుగుదేశం నాయకులు దానికి సంతాప సభ నిర్వహించి ప్రసంగించడం గోబెల్స్ వ్యూహానికి పరాకాష్ట అయితే, పార్క్ హయత్ హోటల్లో పార్టీ కనుసన్నల్లో ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానని చెప్పు కుంటున్న వ్యక్తి ఇద్దరు బీజేపీ నేతలుగా చెప్పుకుంటున్న వ్యక్తులు సమావేశమవ్వడం రహస్య ప్రణాళికకు సాక్ష్యం. వ్యాసకర్త: వర్ధెల్లి మురళి, ఈ మెయిల్: muralivardelli@yahoo.co.in -
ఆర్టికల్ 370 రద్దు: రాజ్యాంగ నిపుణుడి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం చరిత్రాత్మకమైన సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేశారు. అనంతరం ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ.. రాష్ట్రపతి గెజిట్ విడుదల చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగం ప్రకారం చెల్లుతుందా? న్యాయస్థానాల్లో నిలబడుతుందా? అన్నది పలు సందేహాలకు తావిస్తున్న నేపథ్యంలో ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్ ఈ అంశంపై స్పందించారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం రాజ్యాంగబద్ధంగానే కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో ఈ అంశాన్ని అధ్యయనం చేసి.. ఈ నిర్ణయం తీసుకుందని, ఇందులో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా లోపాలు కనిపించడం లేదని తెలిపారు. అయితే, ఇది రాజకీయ నిర్ణయమా? అన్న ప్రశ్నకు దానిపై తాను సమాధానం చెప్పలేనని పేర్కొన్నారు. -
అప్పుడలా! ఇప్పుడు ఎందుకిలా?
భారత జాతీయోద్యమంలో మహిళలు చురుగ్గా పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరంలో పాల్గొనడానికి ముందుకు వచ్చిన మహిళలను మగవాళ్లు తమతో సమానంగా గౌరవించారు. ‘మీరు మహిళలు, బలహీనులు, ఉద్యమంలో పోరాడడానికి మీ శక్తిసామర్థ్యాలు సరిపోవు, ఆ బాధ్యత మాకొదిలేయండి’ అన్న మగవాళ్లు లేరు. మహిళాశక్తిని గుర్తించారు అప్పటి వాళ్లు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ రూపకల్పనలో మహిళలను సమాన స్థాయిలో గౌరవించారు. సామాజికంగానూ, ఆర్థికంగానూ, రాజకీయంగానూ మహిళలకు సమాన ప్రతిపత్తిని కల్పించారు. అవకాశాలను అందిపుచ్చుకునే దగ్గరకు వచ్చేటప్పటికి మహిళలు ఇంటిపట్టునే ఉండాలన్నది సగటు మేల్ సొసైటీ. క్రమంగా... నిర్ణయాధికారానికి అవసరమైన మేధ మహిళలకు ఉండదనే భావన మగవాళ్ల మాటల్లో వ్యక్తమవసాగింది. మహిళలకు ఉద్యోగాలెందుకు అనే ప్రశ్న నుంచి టీచర్, డాక్టర్ వంటి ఉద్యోగాలైతే మేలన్నారు. ఇంజనీర్లుగా ఆడవాళ్లా? అని పెదవి విరిచారు. పత్రికలలో పని చేస్తారా? రాత్రిళ్లు కూడా పని చేయాలి తెలుసా? అన్నారు. పోలీస్ ఉద్యోగాలు చేయాలంటే యూనిఫామ్ వేసుకోవాలిగా అన్నారు. రక్షణ రంగంలో అడుగుపెట్టాలంటే... తుపాకీ మోస్తారా అన్నట్లు చూశారు. చట్టసభల్లోకి వస్తారా? చట్టం చేయడమంటే పచ్చడి రుబ్బడం కాదంటున్నారు. అటకెక్కిన మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడడానికి ఎవరికీ నోరు పెగలడం లేదు. ఎందుకిలా? ఎందుకిలా? అలనాడు ఏడు దశాబ్దాల కిందట ఉద్యమాలు... యుద్ధాలలో లేని వివక్ష, అసమానత్వం... ఇంత పురోగతి సాధించాక ఇప్పుడు ఎందుకిలా? – మంజీర -
తెరచాటు ‘పాలన’ సరికాదు!
విశ్లేషణ: ఏబీకే ప్రసాద్ విభజన బిల్లు పట్ల ఆచితూచి వ్యవహరించవలసిన రాష్ర్టపతి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించినట్టు కనపడదు. వేల సంవత్సరాల చరిత్ర గల ఒక పెద్ద జాతి అయిన తెలుగు జాతి భవితవ్యంతో చెలగాటమాడుతున్నామన్న ఇంగిత జ్ఞానం కూడా పాలకులకున్నట్టు తోచదు! ఇక రాజ్యాంగ చట్టాలను అన్నింటినీ అతిక్రమించడంలో పాలక కాంగ్రెస్ ఎవరికీ లేనన్ని ‘రికార్డులను’ సొంతం చేసుకుంది. చివరికి కోర్టు తీర్పులను సైతం ధిక్కరించడంలోనూ ‘నేర్పరి’గా చావు తెలివితో వ్యవహరించిన చరిత్ర దానికుంది. తెలుగు జాతిని నిలువునా చీల్చే దుర్మార్గపు ప్రక్రియలో భాగంగా కేవలం ఒక కుటుంబ పాలన కొనసాగింపు కోసం కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఇటీవలనే పార్లమెంటు ఉభయ సభల్లోనూ సభ్యుల తీవ్రనిరసనల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టడానికి యత్నించి విఫలమయింది. అయితే ఆ సందర్భంగా సభలలో జరిగిన అవాంఛనీయ పరిణామాల పూర్వరంగంలో పాలక పక్షం రేపు ఎలాంటి అనంతర చర్యకైనా పాల్పడవచ్చు. ఒకసారి నీతి తప్పిన వాడు రెండోసారి తప్పడన్న గ్యారంటీ లేదు. బేరగాడు నేరగాడయితే ఇక అవినీతికి అడ్డూ అదుపూ ఉండదు. పైగా రాజ్యాంగ చట్టాలను అన్నింటినీ అతిక్రమించడంలో పాలక కాంగ్రెస్ ఎవరికీ లేనన్ని ‘రికార్డులను’సొంతం చేసుకుంది. చివరికి న్యాయస్థానాలనూ, వాటి తీర్పులను సైతం ధిక్కరించడంలోనూ ‘నేర్పరి’గా చావు తెలివితో వ్యవహరించిన చరిత్ర దానికుంది! అవసరాన్ని బట్టి వ్యవహరిస్తూ ఒక్కొక్కప్పుడు నిరంకుశంగా రాజ్యాంగ నిబంధనలకు, తప్పుడు భాష్యాలు చెప్పడంలోనూ ఆ పార్టీ ‘ఆరితేరి’పోయింది! ఇందుకు తాజా ఉదాహరణ- 2జీ స్పెక్ట్రం కేటాయింపులపైన గుత్తాధిపత్యం చెలాయించడానికి కొన్ని విదేశీ కంపెనీలకు కాంట్రాక్టులివ్వడంలో జరిగిన కుంభకోణంలో కాంగ్రెస్ పాలకులు భాగస్వాములయినప్పుడు సుప్రీంకోర్టు హెచ్చరించినప్పుడు స్వయాన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సుప్రీం పరిధుల్ని గుర్తు చేయడానికి సాహసించారు! ఢిల్లీ బాటలో పయనిస్తారా? కేంద్రంలో గబ్బుపట్టిపోయిన అవినీతిపై సమరశంఖం పూరించి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన ఒక మాజీ ఉన్నతాధికారి అరవింద్ కేజ్రీవాల్ అతి స్వల్పకాలంలోనే ఢిల్లీ పీఠాన్ని అధిష్టించాడు. అయితే దొంగ ‘లోక్‌పాల్’ బిల్లును కాకుండా ‘జన్‌లోక్‌పాల్’ బిల్లును రూపొందించి ఎప్పుడయితే ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పాలకుడు ప్రవేశపెట్టబోయాడో తగిన మద్దతు లేనందున ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామాకు సిద్ధమవుతూ అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలు జరిపించాలని కోరాడు. ఎన్నికలకు బదులు కాంగ్రెస్ ‘తురుపు’ ముక్కగా రాష్ర్టపతి పాలనను విధించి, అసెంబ్లీని మాత్రం రద్దు చేయకుండా ‘సుప్తచేతనావస్థ’లో ఉంచింది. ఇదే పద్ధతిని, ఆంధ్రప్రదేశ్ విభజన కోసం రేపు యూపీఏ సర్కారు అనుసరించదని భావించరాదు! ఎందుకంటే, మన రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినా అది నిట్టనిలువునా చీలిపోయింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ అస్తిత్వ రాజకీయాల్లో భాగంగా విభజనకు వ్యతిరేకంగా ‘సమైక్య రాష్ట్ర’ నినాదాన్ని చేపట్టినప్పటికీ - తన నాయకురాలైన విభజనవాది సోనియా (ఇటాలియన్ మాత) పట్లనే అనుక్షణం విధేయతను ప్రకటిస్తున్నారన్న విషయాన్ని మరచిపోరాదు! ఆయన రెండు పడవలపైన కాలేశారు. ఇటు కాంగ్రెస్‌ను వీడలేక, అటు సోనియాను కాదనలేక త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈలోగా ‘కిరణ్ అధిష్టానం మాట కాదనరని’ కాంగ్రెస్‌లోనే కొందరు అంటుండగా, ‘కాదు, కొత్త పార్టీ పెడతారనీ’, ‘చెప్పు’దాని ఎన్నికల గుర్తుగా ఉండొచ్చని కొందరు పార్టీ ముఖ్యులే ప్రచారంలో పెట్టారు! ఇప్పటికీ పార్లమెంటులో నిబంధనలకనుగుణంగా ప్రవేశపెట్టని విభజన బిల్లు నేడో రేపో ఆ తంతు ముగుస్తుందన్న వార్తలొస్తున్నాయి. ‘‘లేస్తే మనిషిని కాను అన్నట్టు’’ కిరణ్ వ్యవహారం ఉంది. కాని లేచి మనిషిగా మారితే, అంటే విభజన బిల్లును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇస్తూ ఏం చేయనున్నారు? రాష్ట్ర శాసనసభ రద్దుకు కూడా సిఫార్సు చేస్తారా? అలా సిఫార్సు చేసే పక్షంలో రాష్ట్రపతి పాలనను కేంద్రం రాష్ట్రంలో విధిస్తుందా? లేక ఢిల్లీ శాసనసభ రద్దుకు ప్రతిపాదించిన కేజ్రీవాల్ డిమాండ్‌ను (రాజ్యాంగ రీత్యా ఆయనకు ఆ హక్కు ఉన్నప్పటికీ) కేంద్రపాలిత ప్రాంత ప్రతిపత్తిని ఆసరా చేసుకుని రాష్ట్రపతి పాలనకు కేంద్రం సిద్ధమయినట్టే, ఇటు కిరణ్‌కుమార్ తన సొంత ముఖ్యమంత్రి అయి ఉండి రాష్ట్ర శాసననభ రద్దును కోరినప్పుడు కూడా కేంద్రం అలాగే వ్యవహరిస్తుందా? అన్నది అసలు ప్రశ్న. లేక, సార్వత్రిక ఎన్నికలు తరుముకు వస్తున్నందున రాష్ర్టపతి పాలన ఆరు నెలలపాటు విధిస్తే తనకు కలిగే వెసులుబాటును ప్రచారానికి వినియోగించుకునేందుకు, ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లేందుకూ వీలుగా రాష్ర్టపతి పాలనను కాంగ్రెస్ విధించే ఆలోచనలో ఉందా? లేక రెండు మాసాలుగా కిరణ్‌కుమార్ జనాలకు ‘భరోసా’ ఇస్తూ వచ్చినట్టుగా ఆయన ముఖ్యమంత్రిత్వంలోనే 2014 ఎన్నికలు జరగబోతున్నాయా? ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం తమది కాదు కాబట్టి దానిని క్షణాల్లో యూపీఏ ప్రభుత్వం పడగొట్టడానికి కుట్ర పన్నగా, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంకా అధికారం వెలగబెడుతోంది కాబట్టి రాష్ట్రపతి పాలనను అదుపు తప్పిపోయిన పరిస్థితుల్లో తప్ప ‘సోనియా కొలుపు’ను కూడా మానుకుంటే తప్ప రాష్ట్రపతి పాలనకు అవకాశాలు ఉండకపోవచ్చు. ‘కేంద్ర మంత్రుల బృందం’లో ముఖ్యుడైన మంత్రి జైరామ్ రమేశ్ ఒక ప్రకటనలో ‘బిల్లు వివాదాస్పదంగా ఉన్నందున, తొందరపడి ముందుకు నెట్టడం సాధ్యపడకపోవచ్చు’నని ఓ ‘టుమ్రీ’ వదలడం విశేషమేమీ కాదు. ‘‘టి-బిల్లును ఆమోదింప చేయించుకుని మరీ వస్తానని చెప్పిన ఒక రాజకీయ నాయకుడు దిగాలు పడిపోవడాన్ని కూడా కొన్ని టీవీ చానళ్లు చూపించాయి! ఇం తకూ ఎందుకలా జరిగి ఉంటుంది? ఆ రాజకీయ నాయకుడు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని మాట ఇచ్చి ఉన్నందున ‘‘ముం దు విలీనం చేయి, ఆ తరువాత విభజన’’ అని కాంగ్రెస్ అధిష్టానం పట్టుబట్టింది. ‘‘కాదు, ముందు తెలుగు జాతిని ముక్కలు చేసేయ్, తరువాత కాంగ్రెస్‌లో నా స్థానిక పార్టీని కలిపేస్తానని’’ ఆ నాయకుడు షరతు పెట్టడం జరిగింది. ఈ వాదులాట ఇంకా ఒక కొలిక్కి రాలేదు! సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం రాష్ట్రపతి పాలనకు కేంద్రం ప్రతిపాదన పంపిస్తే, యథాతథంగా అలా సంతకం చేసి పంపమని రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదు. విభజన బిల్లు పట్ల కూడా ఆచితూచి వ్యవహరించవలసిన రాష్ర్టపతి రాజ్యాంగ నిబంధనలకూ సమాఖ్య స్ఫూర్తికీ అనుగుణంగా వ్యవహరించినట్టు కనపడదు! వేల సంవత్సరాల చరిత్ర గల ఒక పెద్ద జాతి అయిన తెలుగు జాతి భవితవ్యంతో చెలగాటమాడుతున్నామన్న ఇంగిత జ్ఞానం కూడా పాలకులకున్నట్టు తోచదు! అదే ఉండి ఉంటే - రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశంలో లేనప్పుడు దొంగచాటుగా గవర్నర్లు 213వ అధికరణ చాటున ఆర్డినెన్సులూ తీసుకురారు. 356వ అధికరణ కింద రాజ్యాంగ విరుద్ధంగా రాష్ర్టపతి పాలన ‘తెర’ చాటున గత 60 ఏళ్లలోనూ 100 సందర్భాల్లో కేంద్ర పాలకులు రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను మింగేసి ఉండే వారూ కాదు! అందుకే ఈ ఉన్మాదానికి 1994లో సుప్రీంకోర్టు తెగించి (బొమ్మైకేసులో) తెరదించవలసి వచ్చింది! మళ్లా 20 సంవత్సరాల తర్వాత ఇదే పక్షవాతపు కాంగ్రెస్ కేజ్రీవాల్ పాలిట పడింది! ఎందుకంటే, రాష్ట్రాల్లో రాజ్యాంగ వ్యవస్థ అమలులో విఫలమైందనుకున్నప్పుడు రాష్ర్టపతి పాలనను విధించకుండానే రాష్ర్ట ప్రభుత్వాలను సంస్కరించి, సరిచేసే అధికారాన్ని, అవకాశాన్నీ కేంద్రానికి రాజ్యాంగం 355/256/254/353/365 అధికరణలు కల్పిస్తున్నాయి! అందుకే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్, రాష్ట్రపతి పాలనకు అవకాశమిస్తున్న 356వ అధికరణపై రాజ్యాంగ నిర్ణయ సభలో వెల్లువెత్తిన విమర్శలకు జవాబిస్తూ ‘‘మిగతా అన్ని ప్రయత్నాలు విఫలమైన తరువాత ఆఖరి తురుపుగా మాత్రమే 356వ అధికరణను ఉపయోగించుకోవచ్చునేగాని, సర్వసాధారణంగా ఆ అధికరణ మృతప్రాయమైనదిగానూ, ఎన్నడూ ఉపయోగించరాని అధికరణగానూ ఉండిపోగలదనే ఆశిస్తున్నాను’’ అన్నారు! ఆయన ఆశ వమ్మయింది! ఒక అధినేత్రి కుటుంబం కోసమో, మరొక నాయకుడి సకుటుంబం కోసమో 9 కోట్ల ప్రజలతో ఉన్న తెలుగు జాతి తన భవిష్యత్తును తాకట్టుపెట్టుకో జాలదు! (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు)