న్యూఢిల్లీ: గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనుండగా నకిలీ లేఖలు కలకలం రేపాయి. ఎన్నికల సంఘం పేరిట పలు లేఖలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. రేపు(సోమవారం) ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఈసీ నిర్ణయం తీసుకుందని ఒక లేఖలో ఉంది. ఈవీఎంల రిగ్గింగ్ జరగకుండా చూసేందుకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని లేఖలో పేర్కొన్నారు. ఈవీఎంల హ్యాకింగ్ జరుగుతున్నట్టు గుజరాత్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పేరుతో కూడా నకిలీ మెసేజ్‌లు సర్క్యూలేట్ అయ్యాయి.
ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాజ్‌కోట్ కలెక్టర్ డాక్టర్ విక్రాంత్ పాండే స్పందించారు. ఈ లేఖలు నకిలీవని, ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నారనడం వదంతులు మాత్రమేనని ఆయన తెలిపారు. ఇటువంటి వందతులను నమ్మొద్దని ఆయన సూచించారు. తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని గుజరాత్ ఎన్నికల సంఘం సీఈవో బీబీ స్వైన్ స్పష్టం చేశారు. కాగా, గుజరాత్‌లోని 37 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment