‘నేను వస్తువును కాను.. అమ్ముడు పోను’ | Gujarat Congress MLA Said I Am Not On Sale Will Not Join BJP | Sakshi
Sakshi News home page

ముక్కలుగా నరికినా బీజేపీలో చేరను : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

Published Wed, May 29 2019 5:36 PM | Last Updated on Wed, May 29 2019 5:38 PM

Gujarat Congress MLA Said I Am Not On Sale Will Not Join BJP - Sakshi

గాంధీనగర్‌ : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్‌ పార్టీ కేవలం 52 స్థానాలకే పరిమితమయ్యి.. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక పోయింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బీజేపీలోకి చేరికలు కొనసాగతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీజేపీలోకి భారీ చేరికలు ఉంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. 15 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను కాంగ్రెస్‌ నాయకులు కొట్టిపారేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఐక్యంగా ఉందని.. బీజేపీలో చేరడం అసంభవం అంటున్నారు.

ఈ క్రమంలో విక్రం మాదమ్‌ అనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘నా శరీరాన్ని 36 ముక్కలుగా నరికినా నేను బీజేపీలో చేరను. నేను బీజేపీలో చేరతానంటూ ప్రచారం చేసేవారికి మతి భ్రమించి ఉంటుంది. నేను వస్తువును కాను.. అమ్ముడు పోను. గత మూడు రోజుల నుంచి నేను నా నియోజకవర్గంలో తిరుగుతున్నాను. ఇంతవరకూ నేను ఏ బీజేపీ నాయకుడితో మాట్లాడలేదు.. ఎప్పటికి కాంగ్రెస్‌తోనే ఉంటాను’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement