సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గుజరాత్లో బీజేపీ వైపే ఓటర్లు మొగ్గు చూపినట్లు ఫలితాలను బట్టి అర్థమౌతోంది. దీంతో ఆరోసారి బీజేపీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే గతంతో పోలిస్తే కాంగ్రెస్ ఓటింగ్ శాతం ఇక్కడ పెరిగినట్లు స్పష్టమౌతోంది. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో కూడా బీజేపీ ఆధిక్యం కనబరిచి ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది.
గుజరాత్, హిమాచల్ ఓట్ల లెక్కింపు.. లైవ్ అప్ డేట్స్
Published Mon, Dec 18 2017 8:02 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Live Updates
గుజరాత్, హిమాచల్... కౌంటింగ్ అప్ డేట్స్
ప్రజలు జీఎస్టీని అంగీకరించి.. మాకు అండగా ఉన్నారు: ప్రధాని మోదీ
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు అభివృద్ధి మార్గాన్ని ఎంచుకున్నారు. అభివృద్ధితోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. జీఎస్టీ వల్ల యూపీ, గుజరాత్, హిమాచల్‌లో బీజేపీ ఓడిపోతుందని ప్రచారం చేశారు. ప్రజలు మాత్రం జీఎస్టీని అంగీకరించి.. మాకు అండగా నిలిచారు. దేశం సంస్కరణలకు సిద్ధంగా ఉందని ఈ ఫలితాలు నిరూపించాయి- ప్రధాని మోదీ
బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం
న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది.
ప్రజాతీర్పును అంగీకరిస్తున్నాం: రాహుల్‌గాంధీ
ప్రజాతీర్పును కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలకు అభినందనలు. నాపై చూపిన అమితమైన ప్రేమానురాగాలకు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ధన్యవాదాలు: ట్విట్టర్లో రాహుల్ గాంధీ
ఈ విజయం ప్రధాని, బీజేపీ కార్యకర్తలది: అమిత్ షా
అపూర్వ విజయాన్ని అందించిన గుజరాత్, హిమాచల్ ప్రజలకు ధన్యవాదాలు. 70 ఏళ్ల స్వాతంత్ర్యం అనంతరం ప్రజాస్వామ్యంలో మరింత మార్పు వచ్చింది. విపక్షాల తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు. విపక్షాలు దుష్ప్రచారం చేసిన తర్వాత కూడా బీజేపీకి ప్రజలు పట్టం కట్టారు. కాంగ్రెస్ ప్రముఖులంతా ఎన్నికల్లో ఓడిపోయారు.
అణగారిన వర్గాల గొంతుకని సభలో వినిపిస్తా!
నన్ను గెలిపించిన వాద్గామ్ ప్రజలకు ధన్యవాదాలు. గుజరాతీ అణగారిన వర్గాల తరఫున అసెంబ్లీలో నేను గళమెత్తుతాను: జిగ్నేష్ మేవాని.. జెఎన్టీయూ విద్యార్థి, దళిత హక్కుల నేత అయిన జిగ్నేష్ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు
ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్
సుపరిపాలన, అభివృద్ధికి ప్రజలు గట్టి మద్దతు తెలిపారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని రుజువు చేశాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడం హర్షణీయం: ప్రధాని నరేంద్ర మోదీ
గుజరాత్ డిప్యూటీ సీఎం గెలుపు
మెహ్సనా నియోజకవర్గంలో గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ గెలుపు
ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే బీజేపీ గెలిచింది: హార్థిక్ పటేల్
చాలాచోట్ల బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు.. రిజర్వేషన్ల కోసం మా పోరాటం కొనసాగుతుంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా బీజేపీపై పోరాడుతాం: హార్థిక్ పటేల్
ఈవీఎంలతోనే గుజరాత్లో గెలిచారు : కాంగ్రెస్
ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలకు దిగింది.
పెట్లద్లో కాంగ్రెస్ గెలుపు
గుజరాత్ పెట్లద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే నిరంజన్ పటేల్ 10వేల ఓట్లతో గెలుపొందారు.
శంకర్ చౌదరి ఓటమి
గుజరాత్ వేవ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శంకర్ చౌదరి ఓటమిపాలయ్యారు.
ఓపెనింగ్ ఇన్నింగ్స్‌లో రాహుల్ జీరో : పారికర్
రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై గోవా సీఎం మనోహర్ పారికర్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ఓపెనింగ్ ఇన్నింగ్స్‌లో సున్నా పరుగులు సాధించారంటూ పారికర్ ఎద్దేవా చేశారు.
ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం : ఎన్నికల మాజీ అధికారులు
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయటం సాధ్యమయ్యే పని కాదని ఎన్నికల మాజీ కమిషనర్లు హెచ్ఎస్ బ్రహ్మ, నవీన్ చావ్లా, ఎన్ గోపాలస్వామి తదితరులు ఓ జాతీయ మీడియా సంస్థతో వ్యాఖ్యానించారు.
జామ్‌నగర్‌లో బీజేపీ ఓటమి
గుజరాత్ జామ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి రాఘవ్జీ పటేల్ ఓటమి.
వాజన్ ఆబూ భాయ్ గెలుపు
గుజరాత్ మంగ్రోల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వాజన్ ఆబూ భాయ్ 13 వేల ఓట్లతో విజయం సాధించారు.
కొట్ఖాయ్లో భాజాపా అభ్యర్థి ముందంజ
హిమాచల్ ప్రదేశ్‌లో అందరి దృష్టి కొట్ఖాయ్ పైనే ఉంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ముందజలో దూసుకుపోతున్నారు. ఈ ప్రాంతంలో జరిగిన యువతి సామూహిక అత్యాచార ఘటన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓ కుదుపు కుదిపేసిన విషయం తెలిసిందే.
గుజరాత్ ధరమ్పూర్లో బీజేపీ విక్టరీ
ధరమ్‌పూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అరవింద్ ఛోటూభాయ్ 22 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
గోహ్లి పరాజయం
గుజరాత్లో మాండ్వి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత శక్తిసిన్హ్ గోహ్లి ఓటమి పాలయ్యారు.
అల్పేష్ ఠాకూర్ ఘన విజయం
రాధన్‌పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, యువ నేత అల్పేష్ ఠాకూర్ ఘన విజయం సాధించారు.
కాంగ్రెస్ మోసపూరిత రాజకీయాలకు చరమగీతం : ఆదిత్యానాథ్
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత రాజకీయాలను ప్రజలు తిస్కరించారని యూపీ సీఎం ఆదిత్యానాథ్ తెలిపారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు బీజేపీ నేతల, కార్యకర్తల సమిష్టి కృషి అని ఆయన అభివర్ణించారు.
సీఎం అభ్యర్ధి ధుమాల్ ఓటమి
హిమాచల్ ప్రదేశ్ బీజేపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్‌కుమార్ ధుమాల్ ఓటమి పాలయ్యారు.
బీజేపీ 34, కాంగ్రెస్ 25 స్థానాల్లో ఆధిక్యం
హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 34, కాంగ్రెస్ 25 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
జిగ్నేష్ మేవానీ ఘన విజయం
గుజరాత్ వడ్గామ్ నియోజక వర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసిన జిగ్నేష్ మేవానీ ఘన విజయం సాధించారు.
పోర్బందర్లో బీజేపీ గెలుపు
పోర్బందర్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి బాబు భాయ్ బొక్రియా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అర్జున్ మోద్వాదియాను 1855 ఓట్ల తేడాతో ఓడించారు.
సీఎం విజయ్ రూపానీ విజయం
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఘన విజయం సాధించారు. 4 వేలకు పైచిలుకు ఓట్లతో రాజ్‌కోట్ వెస్ట్ నుంచి ఆయన గెలుపొందారు.
105 స్థానాల్లో బీజేపీ.. 69లో కాంగ్రెస్ ఆధిక్యం
గుజరాత్ ఫలితాల్లో ప్రస్తుతం 105 స్థానాల్లో బీజేపీ.. 69 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. బీటీపీ 2, ఎన్సీపీ 1, ఇండిపెండెంట్లు 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పోర్బందర్లో కాంగ్రెస్ అభ్యర్థి వెనుకంజ
గుజరాత్ పోర్బందర్ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత అర్జున్ మోద్వాడియా 1500 ఓట్ల వెనకంజలో ఉన్నారు.
హిమాచల్ లో కాంగ్రెస్ అభ్యర్థి అనిరుధ్ సింగ్ విజయం
హిమాచల్ ప్రదేశ్‌లో కసుంప్టి స్థానంలో కాంగ్రస్ అభ్యర్థి అనిరుధ్ సింగ్ ఘన విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
బీజేపీ 101.. కాంగ్రెస్ 74 స్థానాల్లో ఆధిక్యం
గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 101, కాంగ్రెస్ పార్టీ 74 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. భారతీయ ట్రైబల్ పార్టీ 2, ఎన్సీపీ 1, స్వతంత్ర్య అభ్యర్థులు 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
బోసిపోయిన గుజరాత్ గాంధీభవన్
ఉదయం ఫలితాల్లో పుంజుకున్న వార్తలు తెలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మీడియా పెద్ద ఎత్తున్న గాంధీ భవన్ వద్దకు చేరుకోగా.. తెగ సందడి నెలకొంది. అయితే ప్రస్తుతం ఓటమి దిశగా అడుగులు పడతుండటంతో దాదాపుగా ఖాళీ అయిన పరిస్థితి నెలకొంది.
బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద సంబరాలు
రెండు చోట్ల విజయం ఖరారు కావటంతో బీజేపీ శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకున్న కార్యకర్తలు బాణాసంచా పేల్చి, మిఠాయి పంచుకుంటూ సందడి చేస్తున్నాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఆఫీసుల వద్ద ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
స్పష్టమైన ఆధిక్యంలో జిగ్నేష్ మెవానీ
గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో వడ్గామ్ స్థానంలో జిగ్నేష్ మెవానీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 10,785 ఓట్లతో స్వతంత్ర్య అభ్యర్థి అయిన జిగ్నేష్ ముందంజలో ఉన్నారు.
హిమాచల్.. బీజేపీ 41, కాంగ్రెస్ 24 ఆధిక్యం
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో కమలం హవా కొనసాగుతోంది. బీజేపీ పార్టీ 41 స్థానాల్లో.. కాంగ్రెస్ పార్టీ 24 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఆధిక్యం
గుజరాత్ ఎన్నికల్లో సీఎం విజయ్ రూపానీ ముందంజలో ఉన్నారు. 21,000 ఓట్ల మెజార్టీతో ఆయన దూసుకుపోతున్నారు.
గుజరాత్లో సెంచరీ కొట్టేసిన బీజేపీ
గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 100 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్ 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఎన్నికల తీర్పు.. మోదీ విక్టరీ సింబల్
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పార్లమెంట్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ విక్టరీ సింబల్‌తో అభివాదం చేశారు. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశంపై ప్రధాని, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌తో భేటీకానున్నారు.
ఫలితాలపై స్పందించిన హోంశాఖ మంత్రి
గుజరాత్, హిమాచల్ లో స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం అని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
బీజేపీ 98.. కాంగ్రెస్ 70 స్థానాల్లో ఆధిక్యం
గుజరాత్లో బీజేపీ 98.. కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో ఆధిక్యం కనబరిచాయి.
గుజరాత్ మళ్లీ బీజేపీదే : డిప్యూటీ సీఎం
బీజేపీ గెలుపు ఖాయమై పోయిందని నితిన్‌భాయ్ పటేల్ తెలిపారు. గతంలో కంటే ఈసారి ప్రస్తుతం దాదాపు ప్రతీ స్థానంలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోందని ఆయన అంటున్నారు. అయితే డిప్యూటీ సీఎం అయిన ఆయన మహాసేనలో దాదాపు 2000 ఓట్ల వెనుకంజలో ఉండటం విశేషం.
హిమాచల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయం
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయమని సీఎం వీరభద్ర సింగ్ తనయుడు విక్రమాదిత్య సింగ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆయన షిమ్లా రూరల్‌లో ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
గుజరాత్లో ఆధిక్యం... బీజేపీ 96, కాంగ్రెస్ 63
గుజరాత్లో బీజేపీ 96 స్థానాల్లో, కాంగ్రెస్ 63 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
హాఫ్ మార్క్ దాటేసిన బీజేపీ
గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ హాఫ్ మార్క్ దాటేసింది. ప్రస్తుతం 94 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 64 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి
వెనకబడిన సీఎం అభ్యర్థి
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధుమాల్ 1709 ఓట్ల వెనకంజలో ఉన్నారు.
సౌరాష్ట్రలో కాంగ్రెస్ ముందంజ
బీజేపీ కంచుకోటగా భావించే సౌరాష్ట్రలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలోకి వచ్చేసింది.
వెనకంజలో కాంగ్రెస్ కీలక నేత గోహ్లి
మాండ్విలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి శక్తిసిన్హ్ గోహ్లి 1355 ఓట్ల వెనకంజలో ఉన్నారు.
గుజరాత్లో బీజేపీ 83.. కాంగ్రెస్ 63 స్థానాల్లో ఆధిక్యం
గుజరాత్లో బీజేపీ 83.. కాంగ్రెస్ 63 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి
ఆధిక్యంలో సీఎం వీరభద్ర సింగ్
హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ ఆర్కిలో 1162 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
హిమాచల్ ఆధిక్యం.. బీజేపీ 38, కాంగ్రెస్ 22
హిమాచల్ ప్రదేశ్ కౌంటింగ్ లో బీజేపీ 38, కాంగ్రెస్ 22, ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
గుజరాత్లో బీజేపీ 77, కాంగ్రెస్ 59 ఆధిక్యం
బీజేపీ 77, కాంగ్రెస్ పార్టీ 59 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
భారీ ఆధిక్యం దిశగా సీఎం విజయ్ రూపానీ
మూడో రౌండ్ ముగిసే సరికి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ 7000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
గుజరాత్లో బీజేపీ 65.. కాంగ్రెస్ 56 ముందంజ
గుజరాత్లో బీజేపీ 65.. కాంగ్రెస్ 56 సీట్లలో ముందంజలో ఉన్నాయి. మిగతా వారు 1 స్థానంలో ముందంజలో ఉన్నారు.
దూసుకుపోతున్న వీరభద్ర సింగ్ తనయుడు విక్రమాదిత్య
హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ తనయుడు విక్రమాదిత్య షిమ్లా రూరల్ నుంచి పోటీ చేయగా.. ప్రస్తుతం ఆయన 1136 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
విజయ్ రూపానీ ఆధిక్యం
రాజ్ కోట్ వెస్ట్ నుంచి 1800 ఓట్లతో విజయ్ రూపానీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి జితూ వాఘ్హాని
ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి జితూ వాఘ్హాని
హిమాచల్‌లో బీజేపీ ముందంజ
హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ముందంజలో ఉంది. 35 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 16... ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Related News By Category
Related News By Tags
-
బీజేపీ విజయానికి కారణాలేమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీచిన్పటికీ, రిజర్వేషన్ల అంశంపై పాటిదార్లు దూరం అయినప్పటికీ ఫలితాల్లో మాత్రం పాలకపక్ష భారతీయ జనతా పార్టీ ముందుకు దూసుకుపోవడం...
-
ఎన్నికల ఫలితాలపై నేతల రియాక్షన్
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై పలువురు కేంద్ర మంత్రులు, నేతలు స్పందించారు. గుజరాత్ ప్రజలు మరోసారి బీజేపీనే విశ్వసించారని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. నర...
-
బీజేపీ ఖాతాలోకే.. రెండు రాష్ట్రాలు?!
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ఇది నిజంగా శుభవార్తే. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీపై సొంత పార్టీ నేతలే దారుణ విమర్శలు, మోదీ పతనం మొదలైందంటూ వస్తున్న పత్రికా కథనాలతో కమలం కల్లోలంగా ఉన్న స...
-
మరో వివాదంలో చిక్కుకున్న కంగనా రనౌత్
ధర్మశాల : బీజేపీ ఎంపీ,బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ‘ఆధార్ కార్డ్’ వివాదంలో చిక్కుకున్నారు.ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో మండీ లోక్‌సభ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించిన ఆమె తన నియోజకవర్గ...
-
వైరల్ వీడియో : 10 ఉద్యోగాల కోసం ..ఇంటర్వ్యూకి 1800 మంది హాజరు
అహ్మదాబాద్ : దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగానికి ఈ వీడియోనే నిదర్శనం అంటూ నెటిజన్లు ఓ వీడియోని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.ఝగాడియాలోని గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాంప...
Comments
Please login to add a commentAdd a comment