మోదీ సక్సెస్‌లో సగం పాత్ర రాహుల్‌దే | Half Credit for Narendra Modi's 2014 Win Goes to Rahul Gandhi, Says Raj Thackeray | Sakshi
Sakshi News home page

మోదీ సక్సెస్‌లో సగం పాత్ర రాహుల్‌దే

Published Sun, Oct 29 2017 2:54 AM | Last Updated on Fri, Aug 24 2018 1:53 PM

Half Credit for Narendra Modi's 2014 Win Goes to Rahul Gandhi, Says Raj Thackeray - Sakshi

థానే: 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ గెలవడంలో సగం క్రెడిట్‌ అంతా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌దేనని మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎంఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్‌ థాకరే అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో అప్పట్లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని వెక్కిరించడం వల్లే ఓటర్లు రాహుల్‌కు పట్టం కట్టలేదన్నారు. థానేలోని కల్యాణ్‌ వద్ద శుక్రవారం రాత్రి రాజ్‌ థాకరే విలేకరులతో మాట్లాడారు.

‘‘ప్రస్తుతం గుజరాత్‌లో బీజేపీ పార్టీకి ఎదురుగాలి వీస్తోందని నివేదికలు చెబుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోవచ్చు. 2014 లోక్‌ సభ ఎన్నికల్లో మోదీ గెలుపులో రాహుల్‌ గాంధీ 50 శాతం.. సోషల్‌ మీడియా 15 శాతం, 10–20 శాతం బీజేపీ కార్యకర్తలు, ఆరెస్సెస్‌లు కీలక పాత్ర పోషించాయి’’అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement