
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈమేరకు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తమందరి ఆశీస్సులు అక్బరుద్దీన్‌పై ఉంటాయని, వెంటనే కోలుకుని తెలంగాణ ప్రజల సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తాలని పేర్కొన్నారు. కాగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఒవైసీ రెగ్యులర్ వైద్య సేవల కోసం లండన్‌లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. గత రెండు రోజుల క్రితం అక్బరుద్దీన్ తిరిగి ఆకస్మికంగా వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పికి గురికావడంతో కుటుంబ సభ్యులు అక్కడి ఆసుపత్రిలో చేర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment