చెరువు మీద అలిగితే.. చెరువుకు నష్టం కాదు | IYR Krishna Rao Slams CM Chandrababu Naidu on Relations with Centre | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 16 2018 12:54 PM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

IYR Krishna Rao Slams CM Chandrababu Naidu on Relations with Centre - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ పరిపాలనలో ఉండటం ఇదే తొలిసారి కాదని, గతంలోనూ ఈ విధంగా ప్రభుత్వాలు నడిచాయని, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు రాజకీయంగా విభేదించినా ఒక తలుపు తెరిచి ఉంచి.. రాష్ట్ర ప్రయోజనాలను విపక్షాలు కాపాడుకుంటాయని  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు ట్విటర్‌లో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ఈ విషయాన్ని వ్యక్తిగత స్థాయికి తీసుకురావడంతో రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతోందని ఆయన తెలిపారు. ఈ విషయంలో టీడీపీ అస్మదీయ ప్రసార మాధ్యమాలు అగ్నికి ఆజ్యం పోసేవిధంగా ప్రవర్తిస్తున్నాయని ఐవైఆర్‌ విమర్శించారు. అంతేకాకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశాన్ని రాష్ట్రం బహిష్కరించిందని, చెరువు మీద అలిగితే చెరువుకు నష్టం కాదని, అపార అనుభవం గల చంద్రబాబుకు ఈ విషయం తెలియంది కాదని పేర్కొన్నారు. విపక్షంలో ఉంటూనే కరుణానిధి తమిళనాడుకు ప్రయోజనాలు కాపాడారని ఈ విషయంలో చంద్రబాబు విఫలమయ్యారని పరోక్షంగా విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement