
సాక్షి, సంగారెడ్డి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తన దృష్టికి ఆర్టీసీ విలీనం విషయం తీసుకొచ్చి ఉంటే అప్పుడే సమస్యను పరిష్కరించేవాడినని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ వైఖరిని ఎండగట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమాలు చేయాల్సిన అవసరం రాదనుకున్నామని, కానీ ఇంత దారుణ పరిస్థితులు ఉంటాయని ఎవరూ ఊహించలేదని వాపోయారు. ఒకవైపు కోర్టు చీవాట్లు పెడుతున్నా ఒంటెద్దు పోకడలకు పోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శమని విమర్శించారు.
చాలీ చాలని వేతనాలతో ఆర్టీసీ కార్మికులు గొడ్డు చాకిరీ చేస్తున్నారని సానుభూతి వ్యక్తం చేశారు. పోలీసులను ఉపయోగించి ప్రజల గొంతు నొక్కుతున్నారని వ్యాఖ్యానించిన జగ్గారెడ్డి, తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ప్రభుత్వాలు ఇలాగే వ్యవహరించి ఉంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యేదా అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, జగ్గారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment